2009 తర్వాత 2019 ఎన్టీఆర్ సినీ జీవితంలో ఇలా ఎపుడూ జరగలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మ‌ల్టీ స్టార‌ర్ `ఆర్ఆర్ఆర్` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదల కాబోతోంది.  ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తెలంగాణ సాయుధపోరాట యోధుడు కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రపుకుంటుంది. అస‌లు విష‌యంలోకి వెళ్తే.. 2019లో కొంత మంది హీరోలు.. ఒకటికి రెండు మూడు సినిమాలతో పలకరిస్తే.. మరికొందరు కేవలం ఒక్క చిత్రంతోనే ప్రేక్షకులను పలకరించారు. 

 

కానీ కొంద మంది అగ్ర హీరోలు వాళ్లు యాక్ట్ చేసిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఈ యేడాది అసలు సినిమా రిలీజ్ కానీ హీరోల్లో ముందుగా చెప్పుకోవాల్సి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ ‘అరవింద సమేత వీర రాఘవ’ మంచి హిట్ అందుకుంది. `అర‌వింద స‌మేత` మూడు రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీ అయిపోయాడు.

 

అయితే ఈ సినిమా 2020లో విడుద‌ల కానుంది. దీంతో 2019లో ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా విడుదల కాలేదు. 2009లో కూడా ఎన్టీఆర్ నటించిన ఏ చిత్రం విడుదల కాలేదు.  దాదాపు దశాబ్దం తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన ఏ సినిమా విడుదల కానీ సంవత్సరాలుగా 2009,2019 నిలిచిపోయింది. కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తయిన తర్వాత వరుసగా సినిమాలు చేయాలని ఎన్టీయార్ భావిస్తున్నాడట. ఎన్టీయార్ కోసం ఇప్పటికే ముగ్గురు టాప్ డైరెక్టర్లు కథలు సిద్ధం చేశారట. ఈ సినిమా తర్వాత ఎన్టీయార్ చేయబోయే మూడు సినిమాలపై ఓ క్లారిటీ కూడా వచ్చేసింది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: