బాహుబలిలో ప్రభాస్ కి ఒక రేంజ్ లో క్రేజ్  ఉంటుందన్న విషయం తెలిసిందే. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ ప్రభాస్ డైలాగులు చెబుతుంటే సంబర పడిపోయే  అభిమానులు కోట్లలోనే ఉన్నారు. అయితే ఒకప్పుడు టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. దీంతో ప్రభాస్ సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రభాస్ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా వెయిట్ చేసే అభిమానులు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే బాహుబలి సినిమా తో అమాంతం క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత అజిత్ దర్శకత్వంలో చేసిన సాహో మూవీ ప్రేక్షకుల్లో అంచనాలను అందుకోలేక డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుంది. వసూళ్ళ పరంగా మాత్రం ప్రభాస్ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది సాహో మూవీ. 

 

 

 

 ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్  సినిమాలో నటిస్తున్నాడు. మొన్నటి వరకు ఈ చిత్ర షూటింగ్ కాస్త వాయిదా పడింది. సాహో ప్లాప్ తో ప్రభాస్సినిమా కథలో కొన్ని మార్పులు చేయాలని దర్శకునికి సూచించగా... తాజాగా కథలో మార్పులు చేసే పని పూర్తి అయినట్లు సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగా...  వచ్చే ఏడాది సమ్మర్లో జాన్ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ప్రభాస్ కమిట్ అయినట్లు సమాచారం. అంతేకాదండోయ్ తన మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో సంచలనం సృష్టించి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న దర్శకుడు సందీప్ వంగ తో ప్రభాస్మూవీ చేయనున్నట్లు సమాచారం. 

 

 

 

 ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా చెప్పిన స్టోరీ లైన్ కు రెబల్ స్టార్ ప్రభాస్ ఓకే చెప్పినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ కలిసి టీ సిరీస్  పాన్ ఇండియా  లెవల్లో తెరకెక్కుతుందట.  ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని టాక్  వస్తుండడంతో ప్రేక్షకులకు కూడా ఇప్పటి నుంచే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విషయానికి వస్తే... తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా తో టాలీవుడ్ కి కొత్త పుంతలు తొక్కించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ తన సత్తా చాటాడు సందీప్ రెడ్డి వంగా. ఇక ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కే  మూవీ మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: