2019 సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వినయ విధేయ రామ, ఎన్టీయార్ కథానాయకుడు సినిమాలు విడుదలయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రెండు సినిమాలలో ఒక సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంచనా వేయగా ఈ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అనూహ్యంగా సంక్రాంతి పండుగకు విడుదలైన ఎఫ్ 2 సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 
 
అటు వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ నటించిన కొన్ని సీన్లపై, ఇటు ఎన్టీయార్ కథానాయకుడు సినిమాలో బాలకృష్ణ గెటప్, మేకప్ పై విమర్శలు వచ్చాయి. ఎన్టీయార్ పాత్రలో బాలకృష్ణ అంతగా సూట్ కాలేదని కథలో కొన్ని అబద్ధాలను కూడా చూపించారని విమర్శలు వినిపించాయి. ఈ రెండు సినిమాలు వచ్చి దాదాపు సంవత్సరం కావడంతో నెటిజన్లు ఈ రెండు సినిమాలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. 
 
ఈ రెండు సినిమాలు విడుదలైన సమయంలో కొన్ని సెటైరికల్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు విడుదలై ఏడాది అయిందంటూ సెటైరికల్ పోస్టులను, సినిమాలోని సీన్లను నెటిజన్లు షేర్ చేస్తున్నారు . సాధారణంగా నెటిజన్లు సినిమాలు డిజాస్టర్ అయితే కొన్ని రోజులు సెటైరికల్ పోస్టులు పెట్టినా ఆ తరువాత ఆ విషయాన్ని నెటిజన్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. 
 
కానీ ఈ రెండు సినిమాల విషయంలో మాత్రం విచిత్రంగా సినిమాలు విడుదలై సంవత్సరం అయినా ట్రోలింగ్ మాత్రం తగ్గట్లేదు. అప్పట్లో నవ్వులపాలయిన సీన్లను ఇప్పుడు షేర్ చేస్తూ ఉండటం గమనార్హం. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు ఈ రెండు సినిమాలు అటు డిజాస్టర్లుగా మిగలటంతో పాటు ఇటు ట్రోలింగ్ కు గురవుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సినిమా కథ, కథనాల విషయంలో, మేకప్, గెటప్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోకపోతే విడుదలైన సంవత్సరాల తరువాత కూడా ట్రోలింగ్ తప్పదని ఈ రెండు సినిమాలు ప్రూవ్ చేస్తూన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: