ట్రిపుల్ ఆర్ బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. రిలీజ్ డేట్ వాయిదా వేడయంతో బడ్జెట్ కు రెక్కలొచ్చాయి. జులై 30న రావాల్సిన ట్రిపుల్ ఆర్ ఐదు నెలలు లేటుగా రావడంతో బడ్జెట్ మరో 100కోట్లు పెరుగుతుందట.
రాజమౌళి, ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ 300కోట్ల బడ్జెట్ తో మొదలైంది. అనుకున్న టైమ్ లో షెడ్యూల్స్ పూర్తికాకపోవడంతో.. ఖర్చు 100కోట్లు పెరిగింది. రిలీజ్ డేట్ వాయిదాతో మరో 100కోట్లు పెరిగి.. బడ్జెట్ 500కోట్లకు చేరుతుందని అంచనా.
ట్రిపుల్ ఆర్ బడ్జెట్ పెరిగేందుకు హీరోలే ప్రధాన కారణం. ఎన్టీఆర్ 15నెలల నుంచి... రామ్ చరణ్ ఏడాది నుంచి ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా తప్ప మరో చిత్రం చేయడం లేదు. ముందుగా అనుకున్నట్టు.. జులై 30న రిలీజ్ కాబట్టి.. ఏడాదిన్నర పాటు ఆర్ఆర్ ఆర్ షూటింగ్ తప్ప మరో ధ్యాస లేదు. దీంతో ఒక్కొక్కరికి రెండు సినిమాల రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. సినిమా మరో ఆరు నెలలు లేటవడంతో.. ఎక్స్ ట్రా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంది. దీంతో ట్రిపుల్ ఆర్ బడ్జెట్ భారీగా పెరుగుతుంది.
ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 30నుంచి 35కోట్లు ఉంటుంది. రామ్ చరణ్ 25నుంచి 30కోట్ల మధ్యలో ఉంటాడు. ట్రిపుల్ ఆర్ కోసం ఎన్టీఆర్.. రామ్ చరణ్ కు 50కోట్లు ముడుతోంది. అయితే సినిమాలో అదనంగా 10.. 15కోట్లు ఇస్తారని టాక్. అలాగే కెమెరామెన్ సెంథిల్ కుమార్ కూడా ఎక్స్ ట్రా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంది. మొత్తానికి ట్రిపుల్ ఆర్ బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందట. దానికి కారణం వాయిదా పడటమే ప్రధాన కారణమనే వినిపిస్తోంది. నటుల రెమ్యునరేషన్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయట. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు పారితోషకాలు చూసి ఆశ్చర్యపోతున్నారట. అమ్మో ఇంత మన స్టార్లకు ఇంత డిమాండ్ ఉందా అని చెవులుకొరుక్కుంటున్నారట. రిలీజ్ డేట్ వాయిదాతో మరో 100కోట్లు పెరిగి.. బడ్జెట్ 500కోట్లకు చేరుతుందని అంచనా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి