నందమూరి సీనియర్ స్టార్ బాలయ్య ఔరా అనిపిస్తున్నాడు. ఫీడ్ బ్యాక్ తీసుకున్నాడో.. డైరెక్టర్ ఆర్డర్ వేశాడో కానీ బాలయ్య ట్రెండ్ కు తగ్గట్టు మౌల్డ్ అవుతున్నాడట. షేప్ గురించి పట్టించుకోని ఈ వెటరన్ స్టార్ ఇప్పుడు ఏకంగా జిమ్ లో కసరత్తులు చేయడం హాట్ న్యూస్ అవుతోంది. 

 

బాలయ్య ఏ పాత్ర చేసినా తనకు అనుగుణంగా మార్చుకుంటాడు. అంతేగానీ పాత్రకు తగ్గట్టు బాడీని మెయిన్ టైన్ చేయడు. కెరీర్ ఆరంభం నుండి బాలయ్య సినిమాలను ఫాలో అయ్యేవాళ్లు ఈజీగా చెప్పేస్తారు. పోలీస్ ఆఫీసర్ గా చేసినా..ఫ్యాక్షనిస్ట్ గా కనిపించినా.. లీడర్ గా చేసినా.. ఇలా ఏ పాత్ర చేసినా.. జస్ట్ మేకప్ తో గెటప్స్ లో ఛేంజ్ చూపిస్తాడు. అంతేతప్ప పాత్రకు అనుగుణంగా ఎప్పుడూ రియల్ లుక్ ట్రై చేసింది లేదు. కానీ ఫస్ట్ టైమ్ బాలయ్య పాత్ర కోసం మేకోవర్ చేస్తున్నాడట. 

 

గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ మూవీలో కూడా బాలయ్య బొద్దుగానే కనిపించాడు. ఆఖరికి పూరీ జగన్నాథ్ తో సినిమా చేసిన క్యారెక్టర్ లో మేకోవర్ చూపించాడు తప్ప.. బాడీలో ఎలాంటి మేకోవర్ లేదు. కానీ ప్రస్తుతం బోయపాటితో సినిమా కోసం బాలయ్య చేస్తున్న సాహసం చూసి ఫిల్మ్ నగర్ వర్గాలు ఔరా అంటున్నాయని టాక్. 

 

బోయపాటి శ్రీనుతో చేస్తున్న కొత్త సినిమా కోసం బాలయ్య 25కేజీలు బరువు తగ్గుతుండటం విశేషం. రోజుకు మూడు నాలుగు గంటలు బాలయ్య జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నాడట. వచ్చే జూన్ తో బాలయ్యకు 60ఏళ్లు వచ్చేస్తాయి. ఈ ఏజ్ లో పాత్రకోసం నందమూరి స్టార్ కమిట్ మెంట్ చూస్తే ముచ్చటేస్తోందనే చెప్పాలి. అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.మొత్తానికి బాలయ్య మారిపోయాడు. కథకు తగ్గ బాడీ లాంగ్వేజ్ మార్చేపనిలో ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: