మాస్ రాజా రవితేజకు నేచురల్ స్టార్ నాని రియల్ గా హెల్ప్ చేస్తున్నాడా.. తెలివిగా ఇరికించి నాని ఎస్కేప్ అయ్యాడా.. ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు ఇదే టాక్ నడుస్తోంది. తనకు హిట్ ఇచ్చి ఫ్లాప్ లో ఉన్న దర్శకుడితో సినిమా చేయాలని నాని సజెస్ట్ చేశాడట. 

 

మాస్ మహారాజ రవితేజకు సక్సెస్ అందని ద్రాక్షనే అవుతోంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. ఈ సీనియర్ స్టార్ కు కలిసి రావడం లేదు. ఇటీవలే విడుదలైన డిస్కో రాజా కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. రాబోయే సినిమాతో అయినా మాస్ రాజా మాంచి హిట్ కొడతాడా లేదా అనేది ఓ ఫజిల్ గా మారింది. ఇలాంటి టైమ్ లో నాని ఓ దర్శకుడిని మాస్ రాజాకు సజెస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. 

 

రవితేజ, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలోనూ సినిమాకు కమిట్ అయ్యాడట. ఈ దర్శకుడిని రవితేజకు, నానీ సిఫారసు చేశాడని తెలుస్తోంది. నేచురల్ స్టార్ తన దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్ నే రవితేజ వైపు మళ్లించాడన్న టాక్ వినిపిస్తోంది. రవితేజకు అయితే బాగుంటుందని త్రినాథరావును మాస్ రాజా వద్దకు పంపాడట. కథ విన్న రవితేజ ఈ స్క్రిప్ట్ పై నమ్మకంతో ఒకే చేశాడట. ఖచ్చితంగా సినిమా చేద్దామంటూ ప్రామీస్ చేశాడట. 

 

నాని ఇంతకుముందు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నేను లోకల్ మూవీ చేశాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఈ దర్శకుడు రామ్ తో చేసిన హలో గురు ప్రేమ కోసమే డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు నాని కూడా ఫ్లాప్ లో ఉన్నాడు. ఇప్పుడు త్రినాథ రావుతో చేస్తే రిస్క్ అనుకున్నాడో ఏమో గానీ రవితేజకు షిఫ్ట్ చేశాడని టాక్. దీంతో నిజంగానే మాస్ రాజాకు సూట్ అవుతోందని చెప్పాడా. తెలివిగా ఎస్కేప్ అయ్యాడా అంటున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: