స్వీటీ అనుష్క రీసెంట్ గా ఆమె 15 ఏళ్ల సినీ కెరియర్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్నారు. సూపర్ సినిమా నుండి రాబోతున్న నిశ్శబ్దం సినిమా వరకు అనుష్క సినిమా అంటే ఆడియెన్స్ లో ఒక రకమైన ఆసక్తి కలిగేలా చేసుకుంది. అంతేకాదు కేవలం కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా హీరోయిన్ ప్రాధాన్యత సినిమాలు చేస్తూ వస్తుంది. ఇన్నేళ్ల కెరియర్ లో ఏ హీరోయిన్ మీద రానటువంటి రూమర్స్ కూడా అనుష్క మీద వచ్చాయి.

 

సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క అప్పటివరకు బెంగుళూరులో యోగ టీచర్ గా పనిచేసేదట. ఆ టైం లో సూపర్ సినిమా ఆఫర్ వచ్చింది. అయితే సూపర్ సక్సెస్ అవడం అనుష్క వరుస సినిమాలు చేయడం జరుగుతున్న టైం లో ఒక స్టార్ హీరో కొడుకుతో అనుష్క ప్రేమాయణం నడిపించిందని.. ఆల్రెడీ వాళ్లకి ఎంగేజ్మెంట్ కూడా జరిగిందన్న వార్తలు బయటకు వచ్చాయి. ఆ స్టార్ తో నటిస్తూ అతని కొడుకుని పెళ్లాడేందుకు అనుష్క పెద్ద స్కెచ్వేసిందని అప్పట్లో రకరకాల వార్తలు వచ్చాయి.

 

అయితే వాటిల్లో ఏమాత్రం నిజం లేదని ఆ తర్వాత తెలిసింది. సినిమా వాళ్ళ మీద వార్తలు రాస్తే అవి బాగా వెళ్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి వార్తలు రాస్తారు. అనుష్క గురించి వచ్చిన టాప్ మోస్ట్ రూమర్స్ లో ఇది ఒకటని చెప్పొచ్చు. అయితే ఆ స్టార్ హీరో తనయుడు మరో స్టార్ హీరోయిన్ ను పెళ్ళాడి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. నిజంగానే అనుష్క తో ఆ హీరో ఎంగేజ్మెంట్ జరిగితే ఆ వీడియోలు ఎప్పుడో బయటకు వచ్చేవి.. అలా రాలేదు అంటే అసలు అలాంటిదేమి జరగలేదు అన్నట్టే కదా.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: