ఎన్ని కామెంట్స్ వచ్చినా, ఎంతమంది నెగిటివ్ గా మాట్లాడినా.. రెబలిజం చూపించెేందుకు సిద్ధమవుతున్నాడు ప్రభాస్. ఎవరో ఏదో అన్నారని వెనుకడుగు వేసేది లేదు అన్నట్టు.. కటౌట్ కు తగ్గ పనులే చేస్తున్నాడు ప్రభాస్. ఇంతకీ కామెంట్స్ కు ఎదురెళుతూ ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలుసా. 

 

ప్రభాస్ సాహో సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తీసుకొస్తే.. క్రిటిక్స్ యాక్షన్ డోస్ ఓవర్ అయ్యిందని కామెంట్ చేశారు. జనాలు కూడా ప్రీ క్లైమాక్స్ ని అంచనా వేయలేక కన్ ఫ్యూజ్ అయ్యారు. దీంతో బోల్డంత ఖర్చు పెట్టి తీసిన ఫైట్ సీన్ ల విలువ తగ్గిపోయింది. అయితే ప్రభాస్ మాత్రం ఈ విమర్శలను పట్టించుకోకుండా.. ఇమేజ్ కు తగ్గట్టుగానే ముందుకెళ్తున్నాడు. 

 

ప్రభాస్ యాక్షన్ సీక్వెన్సులతోనే అభిమానులకు దగ్గరయ్యాడు. ఛత్రపతి లాంటి సినిమాల్లో ఎమోషనల్ ఫైట్స్ చేసి ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ కటౌట్ తోనే యంగ్ రెబల్ స్టార్ గా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ప్లేస్ కొట్టేశాడు. ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్ ను మిక్స్ చేస్తున్నాడు. 

 

ప్రభాస్ వింటేజ్ లవ్ స్టోరీలో ఓ థ్రిల్లింగ్ ఛేజింగ్ ఉందట. ఈ సీన్ ని సింగిల్ షాట్ లో తీశారని చెబుతున్నారు. ఇక ఈ సింగిల్ షాట్ కోసం 2కోట్లతో భారీ సెట్ నిర్మించారని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. సో యంగ్ రెబల్ స్టార్ స్టార్ ప్రేమ కథలో కూడా ఇమేజ్ కు చోటిచ్చాడనే చెప్పొచ్చు. ఈ కటౌట్ లవ్ తో పాటు ఫైట్ లు చేయాలి అన్నట్టు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వబోతున్నాడనే చెప్పాలి. కుర్రకారులో మంచి క్రేజ్ ఉన్న ప్రభాస్.. తన ఇమేజ్ ను ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. ఎంత వీలైతే అంత కొత్త దనాన్ని ప్రదర్శిస్తూ అభిమానులను ఆకట్టుకునేపనిలో ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: