గవర్నెంట్ కోట్లు ఖర్చు పెట్టి మరీ చెబుతోంది. నో షేక్ హ్యాండ్స్, నో హగ్గింగ్స్ అని కాల్ ట్యూన్లతో చెవిటి వాడికి కూడా వినిపించేలా అనౌన్స్ మెంట్లు ఇస్తోంది. కానీ రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ మాత్రం ఈ ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు. చేతులు కలుపుకోవడమే వద్దురా బాబూ అంటుంటే.. వీళ్లు ఏకంగా కిస్సుల్లోకి వెళ్లిపోయారు. దీంతో నెటిజన్లలో పెద్ద పెద్ద చర్చలు జరిగాయి. 

 

ప్రేమ గుడ్డిది అంటారు గానీ.. అది తప్పు మొండిది అని చెబుతున్నారు రణ్ బీర్ కపూర్, ఆలియా భట్. ప్రపంచమంతా కరోనా దెబ్బకు నమస్కారం సంస్కారం అని పాడుతుంటే.. వీళ్లిద్దరు మాత్రం ముద్దుతో పలుకరించుకుంటున్నారు. లవర్స్ మధ్య దాపరికాలకే స్పేస్ ఉండదు. అలాంటిది కరోనాకు చోటు ఎక్కడిది అన్నట్టు ఆలియాని కిస్ తో విష్ చేశాడు రణ్ బీర్.

 

రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. బ్రహ్మాస్త్ర షూటింగ్ మొదలైనపుడు వీళ్ల లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. అయితే మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోన్న బ్రహ్మాస్త్ర బడ్జెట్ పెరుగుతున్నట్టే.. వీళ్ల బాండింగ్ కూడా పెరిగిపోయింది. ఎంత థిక్ రిలేషన లోకి వెళ్లారంటే పెళ్లికి ముందే కాపురానికి ఫ్లాట్ సిద్ధం చేసుకునేంత ఇదిలోకి వెళ్లిపోయారు రణ్ బీర్ కపూర్, ఆలియా. 

 

గర్ల్ ఫ్రెండ్ బర్త్ డేకి అబ్బాయిల హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. రణ్ బీర్ కూడా ఆలియా బర్త్ డేని ఇలాగే సెలబ్రేట్ చేశాడు. ఆదివారం పార్టీ కూా ఏర్పాటు చేశాడు రణ్ బీర్. ఈ ఆనందంలోనే ఆలియా భట్ కు బుగ్గపై ఓ ముద్దు ఇచ్చాడు. ఈ కాండెట్ మూమెంట్ బయటకు రావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కరోనా ప్రాంతంలోనూ వీళ్లు ముద్దులు పెట్టుకుంటున్నారంటే గ్రేట్ అని సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ ఏడాదిలోనే రణ్ బీర్, ఆలియా అఫీషియల్ గా భార్య భర్తలవుతారని బాలీవుడ్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: