ట్రిపుల్ ఆర్ ఆలస్యం కావడానికి తండ్రీ కొడుకులే కారణమా. చిరంజీవి, రామ్ చరణ్ వల్లే ప్రతిష్టాత్మక చిత్రం ఆలస్యం అవుతుందా. ఆ మధ్య జరిగిన ఓ సంఘటన.. లేటెస్ట్ గా జరిగిన మరో ఇన్సిడెంట్ చూస్తే.. ఈ తండ్రీ కొడుకుల కారణంగానే.. ట్రిపుల్ ఆర్ రిలీజ్ మరింత ఆలస్యం అవుతోందట. ట్రిపుల్ ఆర్ విషయంలో ఈ మెగా హీరోలు ఏం చేశారో పరిశీలిస్తే.. 

 

ట్రిపుల్ ఆర్ షూటింగ్ కు చిరంజీవి నటిస్తున్న ఆచార్య అడ్డంకిగా నిలిచిందా.. ప్రస్తుతం ఫిలిం నగర్ లో దీని గురించే చర్చ. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ 30నిమిషాల పాటు అతిథి పాత్రలో కనిపిస్తాడు. ఇందులో చిరు, చెర్రీ నెట్ లో వినిపిస్తున్నట్టు తండ్రీ, కొడుకులుగా కాకుండా గురుశిష్యులుగా కనిపిస్తారట. అయితే.. ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తికాలేదు. నెల రోజుల పాటు రామ్ చరణ్ ను ఆచార్య కోసం వదిలేయాలంటూ.. రాజమౌళిని అడిగాడు చిరంజీవి. మెగాస్టార్ మాట కాదనలేక.. ఓకే అన్నాడు రాజమౌళి. దీంతో అలియాభట్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తీయాల్సిన సీన్స్ వాయిదా పడే అవకాశం ఉందని తెలిసింది. 

 

కరోనా ఎఫెక్ట్ ఉన్నా.. అంతా కుదుట పడ్డాక వెంటనే షూటింగ్ మొదలుపెట్టి.. రిలీజ్ డేట్ 2021 జనవరి 8 మిస్ కాకూడదన్న పట్టుదలతో రాజమౌళి ఉన్నాడు. ఆచార్య అడ్డుపడటంతో ట్రిపుల్ ఆర్ విడుదల తేదీపై అనుమానాలున్నాయి. 

 

ఆచార్య కోసం.. చిరంజీవి రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తే.. గతంలో సైరా నిర్మాతగా.. సినిమా ప్రమోషన్ కోసం.. రాజమౌళి నుంచి 15రోజులు పర్మిషన్ తీసుకున్నాడు చిరంజీవి. మొత్తానికి తండ్రీ కొడుకులు అడగడం.. రాజమౌళి కాదనలేకపోవడంతో.. ట్రిపుల్ ఆర్ షూటింగ్ కు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. మొత్తానికి ట్రిపుల్ ఆర్ మూవీ ఆలస్యం కావడానికి ఆచార్య అడ్డంకిగా మారిందనే గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: