కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ క్రేజ్ ఉన్న హీరో "తలపతి" విజయ్. వాస్తవంగా సూర్య.. రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ రెమ్యూనరేషన్ కాని మార్కెట్ కాని సంపాదించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ కంటే కూడా సూర్య నే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ని తీసుకున్నాడు ఒకప్పుడు. అయితే రజనీకాంత్ శివాజీ, రోబో సినిమాలతో సౌత్ లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాంటి రజనీకాంత్ కే పోటీగా నిలబడ్డాడు విజయ్. అందుకు కారణం సూర్య మార్కెట్ పడిపోవడమే. దాంతో ప్రస్తుతం కోలీవుడ్ లో ఉన్న సూపర్ స్టార్ హీరోలలో సూర్య, కార్తి, అజిత్, ధనుష్ కంటే విజయ్ మార్కెట్ బాగా పెరిగిందని చెప్పాలి. 

 

గత రెండు మూడేళ్ళుగా విజయ్ నటించిన సినిమాలన్నీ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళని రాబడుతున్నాయి. ఇక విజయ్ నటించిన కత్తి సినిమాతోనే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 గా రూపొందించి సూపర్ హిట్ ని అందుకున్నారు. విజయ్ కి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను మంచి క్రేజ్ ఉందన్న విజయ్ అందరికీ తెలిసందే. తమిళంలో రిలీజైన సినిమాలు ఇక్కడ కూడా రిలీజై మంచి వసూళ్ళని సాధిస్తున్నాయి. విజయ్ గత చిత్రాలు జిల్లా, పోలీస్, ఏజెంట్ భైరవ, అదిరింది, సర్కార్ గా తెలుగులో డబ్ అయి మంచి లాభాలని తెచ్చిపెట్టాయి.

 

ఇక విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా మాస్టర్. లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించింది. యాక్షన్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా పై తమిళ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే 200 కోట్ల బిజినెస్ అయిన ఈ సినిమా ఏప్రిల్ రెండవ వారం లో విజయ్ బర్త్ డే కి రిలీజ్ కావాల్సింది. కాని కరోనా నేపథ్యంలో చెన్నై మొత్తం లాక్ డౌన్ విధించారు.

 

అయితే రిలీజ్ కి ముందే 200 కోట్ల బిజినెస్ అయిందని చిత్ర యూనిట్ సంబరపడినప్పటికి ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పరిస్థితులు అన్నీ మారిపోయాయి. లెక్కలన్ని తలకిందులైపోయాయి. దాంతో ఇప్పుడు సినిమా రిలీజ్ విషయంలో జుట్టు పీక్కుంటున్నారట. థియోటర్స్ కి జనాలు రాకపోతే పరిస్థితులేంటని అందరికంటే ఎక్కువగా విజయ్ టెన్షన్ పడుతున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: