ఏంటి లాక్ డౌన్  లో బోర్ కొడుతుందా.. ఇంట్లో కూర్చుని ఏం చేయాలి అని అనుకుంటున్నారా.... ఇంకా ఎన్నిరోజులు రా బాబు ఇలా ఇంట్లో కూర్చోవడం అని బోర్ ఫీల్ అవుతున్నారా... అంతల బోర్ ఫీలవ్వడం ఎందుకు  కడుపుబ్బ నవ్వించే సినిమాలు.. కనులకు విందునిచ్చే సినిమాలు ఎన్నో ఉండగా బోర్ గా ఫీల్ అవ్వడం ఎందుకు... హాయిగా ఫ్యామిలీతో కలిసి చూసేయకుండా . లాక్ డౌన్  సమయంలో బాగా ఎంటర్టైన్ మెంట్ ఇచ్చే  సినిమాలో ముందుగా ఉండేవి రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసిన సినిమా దగ్గరనుంచి హీరోగా చేసిన అన్ని సినిమాలు ప్రేక్షకులకు ప్రస్తుతం లాక్ డౌన్  సమయంలో మంచి ఎంటర్టైన్మెంట్  ఇస్తాయి. ఇంతకీ లాక్ డౌన్  సమయంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో  ఏ సినిమాలు చూస్తే బాగుంటుంది అంటారా. 

 

 

 ఎవడే సుబ్రహ్మణ్యం... నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ దేవరకొండ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో నాని కంటే ఎక్కువగా విజయ్ దేవరకొండ నటనకు విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ కి  ఎక్కువ పేరు వచ్చింది. ఈ సినిమాలో నాని కి విజయ్ దేవరకొండ కు మధ్య సాగే కన్వర్జేషన్ కామెడీ అంతా బాగుంటుంది అందుకే లాక్ డౌన్  సమయంలో ఇలాంటి సినిమా చూస్తే బాగా ఎంటర్టైన్మెంట్ దొరకడం ఖాయం. ఇక విజయ్ దేవరకొండ హీరోగా పరిచయమైన పెళ్లి చూపులు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్నిసార్లు చూసినా తక్కువే . ఎన్నిసార్లు చూసినా ఈ సినిమాలో ఉన్న కామెడీకి కడుపుబ్బ నవ్వు కోవలసిందే. సినిమాలోని ప్రతి పంచ్ కి  పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. 

 

 

 అందుకే లాక్ డౌన్ సమయంలో కడుపుబ్బ నవ్వు కోవాలి అంటే పెళ్లి చూపులు సినిమా చూస్తే  ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. ఇక అర్జున్ రెడ్డి సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఎన్ని సార్లు చూసిన మళ్ళి మళ్ళీ చూడాలనిపిస్తుంది ఉంటుంది. అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ సినిమా తర్వాత ఎంతో డీసెంట్ అబ్బాయి గా విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా ప్రేక్షకులను మరింతగా అలరిస్తుంది అని చెప్పాలి. అమాయకుడి పాత్రలో నటించిన విజయ్  సినిమా చూస్తున్న ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తాడు. అందుకే లాక్ డౌన్  సమయంలో ఈ  సినిమా చూస్తే బెటర్. అంతేకాకుండా టాక్సీవాలా సినిమా కూడా లాక్ డౌన్  సమయంలో ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. కార్ లో దయ్యం  ఉంది అనే అపోహలో ఉండే విజయ్ దేవరకొండ చేసే కామెడీ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: