కోలీవుడ్ విలక్షణ నటుడు, హీరో విలన్ అనే తేడా లేకుండా ఏ పాత్రలైనా చేస్తూ అలరిస్తున్న విజయ్ సేతుపతి తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాలో చిన్న పాత్రలో అలరించిన విజయ్ సేతుపతి లేటెస్ట్ గా మెగా మేనళ్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్న ఉప్పెన సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నారు. 

 

ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. సినిమాను సుకుమార్ సమర్పణలో మైత్రి  నిర్మిస్తున్నారు. సినిమా నుండి ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. సినిమాలో విజయ్ సేతుపతి నటించినందుకు భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా ఇచ్చారట. అయితే అవి కాకుండా సినిమా అవుట్ ఫుట్ చూసిన విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని తీసుకోకుండా ఉప్పెన సినిమా తమిళ రీమేక్ రైట్స్ తీసుకున్నాడట. 

 

విజయ్ సేతుపతి వేసిన స్కెచ్ కు ఉప్పెన నిర్మాతల మైండ్ బ్లాంక్ అయ్యింది. సినిమా రిలీజ్ కాకపోయినా రష్ చూసి సినిమా హిట్ పక్కా అనే భావన వచ్చిందట. అందుకే విజయ్ సేతుపతి ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయాలని చూస్తున్నాడట. ఐతే తమిళంలో విజయ్ సేతుపతిరీమేక్ ను ఎవరితో చేస్తాడు.. రీమేక్ రైట్స్ ను విజయ్ ఎంతకు దక్కించుకున్నాడు అన్న విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఉప్పెనలో నటించిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇద్దరి జోడీకి ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. మరి రిలీజ్ తర్వాత ఈ జంటకు ఆడియెన్స్ ఎన్ని మార్కులు వేస్తారో చూడాలి.                

మరింత సమాచారం తెలుసుకోండి: