బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కి ఒక మంచి గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. నటనతోనే కాదు సినిమా కు తగ్గట్టుగా పాత్రకు తగ్గట్టుగా తన బాడీని  మార్చుకుంటూ ఏ  హీరో చేయని సాహసాన్ని చేస్తూ ఉంటాడు అమీర్ ఖాన్. అందుకే అమీర్ ఖాన్ను బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ హీరో అని పిలుస్తూ ఉంటారు. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న అమీర్ ఖాన్ అటు సినిమాలలోనే కాదు ఇటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాలకు కుటుంబానికి సంబంధించిన పలు అప్డేట్స్ ఎప్పుడు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోనే  ఉంటారు. ఇక బాలీవుడ్ తారలు ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది అన్న విషయం తెలిసిందే.

 

 

అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న వేల ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీల అందరూ ప్రస్తుతం ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఇంట్లో ఉండి హాయిగా ఫ్యామిలీతో గడుపుతుంటే ఇంకొంతమంది కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ లాక్ డౌన్  సమయాన్ని  ఉపయోగిస్తున్నారు. అయితే లాక్ డౌన్  ముందు సినిమాలతో బాగా అభిమానులను అలరించిన సెలబ్రిటీలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు  ఏదో ఒక విధంగా అలరిస్తూనే ఉన్నారు.  తాజాగా అమీర్ ఖాన్ కి  సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది..

 

 

 అమీర్ ఖాన్ ఒక దగ్గర కూర్చుని ఉండగా ఏదో విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇదే సమయంలో అమీర్ ఖాన్ కొడుకు   ఆజాద్ అమీర్ ఖాన్ భుజాలపై కూర్చుని తొడలపై కాళ్ళు పెట్టి అమీర్ ఖాన్ లాగే దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టాడు. ఈ ఫోటో అభిమానులను తెగ ఆకర్షించేస్తుంది. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ ఫోటో. ఇంతకీ ఈ ఇద్దరు అంతలా ఏం ఆలోచిస్తున్నారో అని  అభిమానులు కూడా ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: