ఈ ఏడాదిలో నందమూరి బాలకృష్ణ నటించిన అధినాయకుడు, ఊకొడతారా ఊల్కిపడతారా, శ్రీమన్నారాయణ సినిమాలు వరసగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే బాలకృష్ణ కొత్త చిత్రం గురించి ఎలాంటి సమాచారం లేదు. 100వ చిత్రం మైలురాయికి బాలకృష్ణ చాలా దగ్గర గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో బాలకృష్ణ కొత్త చిత్రం సమాచారం గురించి అతని అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాల మీద దృష్టి పెట్టుతున్నాడని, తెలుగు దేశం పార్టీని బలోపేతం చేయడం పై బాలయ్య తన మనసుని లగ్నం చేశాడని, కాబట్టి బాలకృష్ణ తన కొత్త చిత్రం గురించి ఆలోచించడం లేదని ఫిల్మ్ నగర్ నుంచి వస్తున్న తాజా సమాచారం.    

మరింత సమాచారం తెలుసుకోండి: