భారతదేశంలో కరోనా విజృంభిస్తున్న  వేళ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన కనికా కపూర్ చాలా మంది ప్రముఖులతో ఓకే విందు  నిర్వహించడం.... ఆ తర్వాత కనికా కపూర్ కి వ్యాధి  నిర్ధారణ కావడంతో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఇక కనికా కపూర్ తో పార్టీలో పాల్గొన్న చాలామంది హోమ్ క్వారంటైన్  లోకి వెళ్లి పోయారు. వీరిలో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా ఉండడం గమనార్హం. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఐసొలేషన్ వార్డులో  చికిత్స తీసుకున్న బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంది. ఇక కరోనా  వైరస్ నుంచి కోరుకున్న కనికా  తన పెద్ద మనసు చాటుకున్నారు. 

 

 

 కరోనా వైరస్ రోగులకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు ప్లాస్మా తెరఫీ అందుబాటులోకి తెస్తున్న విషయం. అంటే కరోనా  వైరస్ బారినపడి చికిత్స పొంది కోలుకున్న వారి దగ్గర్నుంచి ప్లాస్మా సేకరించి కరోనా బారిన పడిన వారికి ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వారు కూడా వైరస్ నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ తరహా థెరపీని... ప్రభుత్వం ప్రవేశ పెట్టాలని భావించినప్పటికీ.. కరోనా నుంచి కోలుకున్న రోగులు మాత్రం ప్లాస్మా ఇచ్చెదుకు  ఒప్పుకోవడం లేదు. కానీ తాజాగా కనికా కపూర్ తన ప్లాస్మా ఇస్తాను అంటూ లక్నోలోని కింగ్ జార్జ మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రికి తెలిపింది. ఈ మేరకు హాస్పిటల్ కుసంబంధించిన అధికారి విషయాన్ని వెల్లడించారు. 

 

 

 కరోనా  వైరస్ బారి నుండి కోలుకున్న తాను తన ప్లాస్మాను దానం చేయడానికి నిర్ణయించానని అంతేకాకుండా నాకు వీలైనంత సహాయం చేయాలని నేను అనుకొంటున్నాను అంటూ కనికా కపూర్ తెలిపింది. అయితే ప్లాస్మా ఇచ్చినప్పటికీ అది ఉపయోగ పడుతుందా లేదా అనడానికి కూడా చాలా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ముందుగా ప్లాస్మా ఇచ్చిన వారి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి 12.5 శాతం కన్నా ఎక్కువ ఉండాలి...సదరు  వ్యక్తి బరువు 50 కిలో గ్రాముల కన్నా అధికంగానే ఉండాలి... ప్లాస్మా ఇచ్చిన వ్యక్తులకు హృదయసంబంధ వ్యాధులు సహా మలేరియా వంటి ఇతర వ్యాధులు ఉండకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: