తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించారు సుబ్బరాజు. ఓవైపు విలన్గా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మంచి పాత్రలను దక్కించుకుంటూ తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు సుబ్బరాజు. హీరోలకు ధీటుగా నటిస్తూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు తన నటనతో ఆకట్టుకున్నాడు. తన  విలనిజంతో కూడా హీరోల ను ఢీ కొట్టాడు . అయితే సుబ్బరాజు వయసు పెరిగిపోతుంది అప్పటికీ ఇప్పటికీ పెళ్లి జోలికి మాత్రం వెళ్లలేదు అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్బరాజు పెళ్లికి సంబంధించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా సుబ్బరాజు తన పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

 

 

 తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన  అయిన  సుబ్బరాజు ఇప్పటిదాకా పెళ్లి చేసుకోక పోవడానికి గల కారణం ఏంటో చెప్పుకొచ్చాడు. ఇప్పటికే 43 ఏళ్ల వయసు దాటి పోతున్న సుబ్బరాజు ఇంకా పెళ్లి జోలికి వెళ్ళలేదు. బ్యాచులట్  జీవితాన్ని గడుపుతున్నాడు సుబ్బరాజు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించి ప్రశ్నలు ఎదురవ్వగా  సుబ్బరాజు ఆసక్తికర సమాధానం చెప్పాడు. పెళ్లి చేసుకోవాలంటే కేవలం వయసు మాత్రమే ఆధారం కాదని... 25 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకోవాలని అందరూ అనుకుంటారు కాబట్టి నేను కూడా అలా చేసుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు అంటూ సుబ్బరాజు తెలిపాడు . జీవిత భాగస్వామికి తాను బెస్ట్ ఇవ్వగలను లోటు రాకుండా చూసుకో గలరు అని నాకు అనిపించినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటాను అంటూ సుబ్బరాజు పెళ్లి పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 

 

 

 ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుబ్బరాజు తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా నిశ్శబ్దంలో కూడా ఓ ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. అయితే సుబ్బరాజు పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా  మారాయి. చూడాలి మరి సుబ్బరాజు కు ఎప్పుడు పెళ్లి మీద ధ్యాస మళ్లుతుందో అని.

మరింత సమాచారం తెలుసుకోండి: