ఎన్నో దశాబ్దాల నుంచి కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైనా వెంకటేష్ గత కొంతకాలంగా మల్టీస్టారర్ సినిమాల పైన ఎక్కువగా మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. యువ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూ మంచి విజయాన్ని అందుకున్నారు విక్టరీ వెంకటేష్. దాదాపుగా ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న సినిమాలన్నీ మల్టీస్టారర్ సినిమాలే . సోలోగా వెంకటేష్ హీరోగా సినిమాలు చేసి చాలా రోజులు అయింది అని చెప్పాలి. ఇకపోతే మల్టీస్టారర్ సినిమాల విషయానికొస్తే... యువ హీరోలతో నటిస్తూ దుమ్మురేపుతున్నాడు  వెంకటేష్. మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. 

 

 

 గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 సినిమా తో మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమాలో  నటించిన వెంకటేష్ ఆ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టే ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన వెంకీమామ సినిమాతో సొంత మేనల్లుడైన నాగచైతన్యతో రీల్ లైఫ్లో కూడా రియల్ లైఫ్ పాత్రల్లో  నటించి అభిమానులను ఎంతో అలరించడమే కాదు మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

 

 

 అయితే యువ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు వెంకటేష్ కి బాగా కలిసి వస్తున్నాయి. కానీ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో చేసిన మల్టీస్టారర్ సినిమా మాత్రం ఎక్కడో బెడిసికొట్టింది వెంకటేష్ కి . రామ్ వెంకటేష్ హీరోగా  మల్టీస్టారర్ గా తెరకెక్కిన మసాలా సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమాలో కామెడీ పరంగా వెంకటేష్ తనదైన నటనతో ఆకట్టుకున్నప్పటికి  ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకర్షించ లేకపోయింది. దీంతో వెంకటేష్ ఇప్పటి వరకు యువ హీరోలతో నటించిన మల్టీ స్టారర్ సినిమాలతో మసాలా సినిమా కాస్త బెడిసి కొట్టింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: