ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన తేదీలు జనాల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతాయి. అలా సినీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని తేదీ మే 9. సినీ పంచాంగం ప్రకారం ఈ తేదీన విడుదలైన దాదాపు అన్ని సినిమాలు సూపర్‌ హిట్‌ అవుతాయి. జగదేకవీరుడు అతిలోకసుందరి, మరో చరిత్ర, భారతీయుడు, ప్రేమించుకుందాం రా, సంతోషం, మహానటి, మహర్షి వంటి చిత్రాలు మే 9న విడుదలయ్యాయి. ఈ చిత్రాలు ఏ రేంజ్‌లో విజయాలు అందుకున్నాయో మనందరికీ తెలిసిందే.

 

మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి టాలీవుడ్‌ చరిత్రలోనే ఓ అద్భుతం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం వచ్చి నేటికి 30 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే చూడకుండా ఎవరూ ఉండలేరు. అలానే ‘ప్రేమించుకుందాం రా’తో వెంకటేష్‌ తన నటనతో ప్రతీ ఒక్క ప్రేమికుడి మనసు గెలుచుకున్నాడు. ఇక నాగార్జున నటించిన 'సంతోషం' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. దశరధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2002 మే 9న విడుదలైంది. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌గా రూపొందించి ‘మహానటి’గా చూపించాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. కీర్తి సురేష్‌ సావిత్రి పాత్రలో పరకాయప్రవేశం చేశారు. క్లాసిక్‌ వండర్‌గా వచ్చిన ఈ చిత్రం ఎన్నో సెన్సేషన్‌ రికార్డులను నమోదు చేసింది. ఈ తరం సినీ అభిమానులకు సావిత్రి గురించి తెలిపిన మహా చిత్రం ‘మహానటి’.

 

Amazon.in: Buy Santhosham DVD, Blu-ray Online at Best Prices in ...

 

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, వంశీపైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన కమర్షియల్‌ చిత్రం ‘మహర్షి’. మహేశ్‌ కెరీర్‌లో మర్చిపోలేని మైలురాయిగా ‘మహర్షి’ నిలిచింది. ఈ చిత్రాలన్నీ మే 9న విడుదల కావడం విశేషం. అంతేకాకుండా ఈ రోజు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్నారు. టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ సాయి పల్లవి, బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు,  హీరో రానా తమ్ముడు అభిరామ్‌లది ఈరోజు బర్త్‌డే. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ తేదీన మరిన్ని చిత్రాలు, విశేషాలు వచ్చి చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

 
Preminchukundam Raa - Download Songs by S. P. Balasubrahmanyam ...

మరింత సమాచారం తెలుసుకోండి: