హీరోయిజం సినిమాలను ఏలుతోన్న రోజుల్లో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఉండటమే కష్టమైపోతోంది. అలాంటిది హీరోయిన్ డామినేషన్ కు ఛాన్స్ ఉంటుందా.. చాలా కష్టం.. కానీ సాయిపల్లవి మాత్రం ఈ ఫార్మాట్ కు ఎదురు వెళ్తోంది. డామినేటింగ్ రోల్స్ తో హైబ్రిడ్ పిల్ల అనిపించుకుంటోంది. మరి సాయి పల్లవి హీరోల రాజ్యంలోనూ సొంత గుర్తింపు ఎలా తెచ్చుకోగలుగుతుందో తెలుసా.. 

 

సాయి పల్లవి ఇప్పటి వరకు టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమా చేయలేదు. కానీ స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. హైబ్రిడ్ పిల్లగా జనాలకు కనెక్ట్ అయింది. డాన్స్, పెర్ఫామెన్స్ ఇరగదీస్తుందనే ఇమేజ్ తెచ్చుకుంది. శర్వానంద్ లాంటి ఆర్టిస్ట్ కూడా సాయిపల్లవి ఫ్రేమ్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ గా చెప్పేంత రేంజ్ కు వెళ్లింది. ఇప్పటికీ ఈ ఇమేజ్ కంటిన్యూ చేస్తూనే ఉంది. 

 

ఏ హీరోకైనా ఒకటి రెండు సినిమాల్లోనే పెర్ఫామెన్స్ చేసే స్కోప్ దొరుకుతుంది. కానీ సాయిపల్లవి మాత్రం వరుసగా సాలిడ్ క్యారెక్టర్స్ చేస్తోంది. హీరోలతో సమానంగా ఉన్నపాత్రలు, ఒక్కోసారి డామినేటింగ్ రోల్స్ కూడా ప్లే చేస్తోంది పల్లవి. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగచైతన్యలో కలిసి చేస్తోన్న లవ్ స్టోరీలో పల్లవి పాత్ర ప్రేక్షకులను ప్రేమలో పడేస్తుందని చెబుతున్నారు. 

 

సాయి పల్లవి అంటే లవ్ స్టోరీస్ మాత్రమే కాదు.. మరో షేడ్ కూడా ఉందని చెప్పడానికి ఇప్పుడు తుపాకీ పట్టింది. విరాటపర్వం సినిమాలో నక్సలైట్ గా కనిపిస్తోంది సాయి పల్లవి. సో ఈ సినిమాలు చూస్తోంటే.. సాయి పల్లవి తన జర్నీని కొంచెం యూనిక్ గానే ప్లాన్ చేసుకుంటోందని చెప్పొచ్చు. అందుకే చాలా మంది హీరోయిన్లు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ రావడం లేదని కంప్లైంట్ చేస్తుంటే.. ఈమె మాత్రం స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంటోంది. మొత్తానికి ఈ హైబ్రిడ్ పిల్ల యూనిక్ రోల్స్ తో అదరగొడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: