సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో అనుక్షణం ఏదో ఒక ట్విస్ట్  ఉంటూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మామూలుగా అయితే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటి రెండు ట్విస్ట్ లు ఉంటాయి... కానీ క్షణ క్షణం అడుగడుగునా ట్విస్టులు ఉంటే ఇక ఆ సినిమా ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా అడుగడుగునా ప్రేక్షకులను మరింత ఆశ్చర్యానికి లోను చేస్తూ ఆసక్తిని కలిగించే సినిమా దృశ్యం. విక్టరీ వెంకటేష్ మీనా ప్రధాన పాత్రలలో శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఏదో ఒక డిఫరెంట్ సినిమాగా నిలిచింది. 

 

 

 మామూలుగా అయితే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో చివరలో ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం ప్రతి క్షణం ఒక ట్విస్ట్  ఉంటుంది. అడుగడుగున ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఒక సాదాసీదా జీవితం గడిపే మీనా వెంకటేష్ కుటుంబంలో ఒక సమస్య ఎదురయింది. ఆ సమస్యను వెంకటేష్ ఎలా సాల్వ్ చేస్తాడు. సినిమాలను ఎక్కువగా చూసే అలవాటు ఉన్న వెంకటేష్ ఆ సినిమాల్లోని ఎత్తులు పై ఎత్తులను జీవితంలో ఎలా ఉపయోగించాడు అన్నది ఈ సినిమాలో  కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటారు. 

 

 

 ఒక సంపన్నుల కుటుంబానికి చెందిన వ్యక్తి తమ కుటుంబంలో సమస్యలు సృష్టిస్తే... ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు వెంకటేష్ కుటుంబం కారణంగా మరణిస్తే... తమ కుటుంబాన్ని కాపాడుకుంటూనే మరోవైపు పోలీసులకు ఎక్కడా ఆధారాలు చిక్కకుండా వెంకటేష్ వేసే ఎత్తులు పై ఎత్తులు సినిమా చూస్తున్న ప్రేక్షకులకు.. ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అందుకే  ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాగా నిలిచిపోయింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరూ సినిమాలు ఎక్కువగా చూసే అలవాటు ఉంటే ఇంత  తెలివిగా కూడా ఆలోచించ వచ్చా అని  అనుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: