యంగ్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌`. చాలా కాలం హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ ఇద్దరికీ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా వేరే లెవ‌ల్‌కు తీసుకుపోయింది. ఎప్పుడూ ల‌వ‌ర్ బాయ్‌గా క‌నిపించే రామ్‌.. ఈ సినిమాలో మాస్ లుక్‌తో విశ్వ‌రూపం చూపించేశాడు. ఈ సినిమాలో రామ్ నటనకి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన ఈ సినిమాను బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు. మొదట్లో మిక్స్‌డ్ టాక్‌ను దక్కించుకున్నప్పటికీ, క్రమంగా హిట్ చిత్రంగా నిలిచింది.  ఈ క్ర‌మంలోనే పెట్టిన పెట్డుబడికి మూడింతల లాభాల్ని తీసుకొచ్చింది. 

 

నిజానికి పూరి జగన్నాథ్ స్టోరీ, రామ్ ఎనర్జీ చిత్ర విజయానికి ప్లస్ అయ్యాయి. ఇక పూరీ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హక్కులను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ రేటుకే కొనుగోలు చేసినట్టు సమాచారం.

 

అంతేకాదు,  ఈ సినిమాలో వరుసగా ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతోన్న బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా కనిపించబోతున్నట్లు టాక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రియు ఈ సినిమా అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు కొంద‌రు. ఒకవేళ హీరో రణ్ బీర్ కపూర్ అయితే దర్శక నిర్మాతలు ఎవరనేది తెలియాల్సి ఉంది. మ‌రి రణ్ బీర్ కపూర్ మాస్ లుక్కులో బాలీవుడ్ జనాల్ని ఎంత వ‌ర‌కు ఆకట్టుకుంటాడు..? బాలీవుడ్‌లో ఈ సినిమా.. టాలీవుడ్ స్థాయిలో హిట్ అవుతుందా..? లేదా..? అన్న‌ది చూడాలి.
 

   

మరింత సమాచారం తెలుసుకోండి: