మొదట్లో సినిమా ప్రయత్నాలు చేసి సైడ్ రోల్స్ మాత్రమే వస్తున్నాయని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది రష్మీ గౌతమ్. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండిటిలో యాంకర్ గా తన సత్తా చాటుతూ వస్తున్న రష్మీ గుంటూరు టాకీస్ సినిమాతో మరోసారి వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. గుంటూరు టాకీస్ లో అమ్మడు చేసిన బోల్డ్ షో బాగా క్రేజ్ తెచ్చింది. అప్పటినుండి రష్మీ వరుస ఆఫర్లు అందుకుంది. 

 

స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అనే తేడాలేకుండా రష్మీ వరుస ఆఫర్లతో అదరగొట్టేస్తుంది. ఇక ఇప్పుడు కొత్తగా ఓటిటి నుండి వెబ్ సీరీస్ ఛాన్సులు అందుకుంటుందని తెలుస్తుంది.  బాలీవుడ్ లో ఇప్పటికే వెబ్ సీరీస్ లు బాగా పాపులర్ అయ్యాయి. తెలుగులో కూడా ఈమధ్య వెబ్ సీరీస్ లు బాగానే వస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఆహా బోల్డ్ వెబ్ సీరీస్ లను తీయాలని ప్రయత్నిస్తుంది. 

 

అందుకే ఆల్రెడీ హాట్ ఇమేజ్ ఉన్న రష్మీతో ఒక వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారట. వెబ్ సీరీస్ లో రష్మీ తన హాట్ షోతో ఆకట్టుకోవడమే కాదు ఇంటిమేట్ సీన్స్ కూడా చేస్తుందని తెలుస్తుంది.  అంతేకాదు వెబ్ సీరీస్ లో నటించేందుకు ఆమె భారీ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. ఎలాగు స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ తన అందంతో అదరగొడుతున్న రష్మి ఇక మీదట వెబ్ సీరీస్ లతో కూడా ఆడియెన్స్ ను అలరించాలని చూస్తుంది. కచ్చితంగా వెబ్ సీరీస్ అడల్ట్ కంటెంట్ కు రష్మి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని అంటున్నారు. తనకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఇందుకు సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. రష్మి చేయబోయే వెబ్ సీరీస్ ఏంటి దానిలో ఎవరెవరు నటిస్తారు. రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుంది అన్న విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: