ఈ మధ్య డమరుకం కోసం సక్కుబాయినే అంటూ చిందేసింది ఛార్మి. నాగార్జున సినిమాల్లో ఛార్మి స్పెషల్ డ్యాన్స్ చేయడం ఇది కొత్తేమీ కాదు. ప్రస్తుతం నాయికగా పెద్ద అవకాశాలు కూడా లేవు. టెన్త్ క్లాస్, నోట్ బుక్ చందు దర్శకత్వంలో ఛార్మి వేశ్యగా నటిస్తోంది. అందుకే ఖాళీ సమయాల్లో పెద్ద హీరోల చిత్రాల్లో డ్యాన్సులు చేస్తోంది. తాజాగా పునీత్ రాజ్ కుమార్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బెంగుళూరుకు వెళ్ళింది ఛార్మి. ఐటెమ్ సాంగ్స్ అంటే చీప్ కాదని, ముమైత్ ఖాన్ లాంటి వారికి ఎంతో కీర్తి తెచ్చిపెట్టినవి స్పెషల్ సాంగ్సేనని చెప్తోంది ఛార్మి. 

మరింత సమాచారం తెలుసుకోండి: