బాలీవుడ్ యువ హీరో తాను పెళ్లి చేసుకుంటే దీపికా పదుకొనే లాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని అంటున్నాడు. బీ టౌన్ హాట్ లాడే దీపికా అంటే కార్తీక్ ఆర్యన్ ను చాలా ఇష్టం. తాను దీపికా ఫ్యాన్ అని బాహాటంగానే చెప్పుకుంటాడు. ఇప్పుడు పెళ్లంటూ చేసుకుంటే దీపికా లాంటి అమ్మాయినే చేసుకుంటా అంటున్నాడు. ఇంతకీ దీపికాలో అతనికి ఏం నచ్చింది అంటే తన భర్త రణ్ వీర్ సింగ్ ను ముద్దు చేయడం అంటున్నాడు కార్తీక్ ఆర్యన్. దీపికా రన్ వీర్ ను ముద్దు చేస్తుంది.. ఈ ప్రపంచంలో దీపికాకు ముద్దు వచ్చే ముఖం కేవలం రణ్ వీర్ ది మాత్రమే.. అలా భర్తను ముద్దు చేసే అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఒక అదృష్టం అంటున్నాడు కార్తీక్ ఆర్యన్. 


రణ్ వీర్, దీపికా కొన్నాలు ప్రేమించుకుని తర్వాత పెళ్లి చేసుకున్నారు. 2018లో వీరి మ్యారేజ్ జరిగింది. టైం దొరికితే చాలు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంటారు. అవి చూసే పెళ్లంటూ చేసుకుంటే దీపికాలా భర్తను ప్రేమించే అమ్మాయిని చేసుకోవాలని కార్తీక్ ఆర్యన్ లాంటి యువ హీరోలు అనుకుంటున్నారు. ప్యార్ కా పూచ్నామా సినిమాతో బాలీవుడ్ లో హీరోగా పరిచయమైనా కార్తీక్ ఆర్యన్ కాంచి, గెస్ట్ ఇన్ లండన్, సోను కి టిటు కి స్వీటీ, పతి పత్ని ఔర్ వహ్, లవ్ ఆజ్ కాల్ సినిమాలతో బాలీవుడ్ లో తన ముద్ర వేసుకోవాలని చూస్తున్నాడు. 


దీపికా అంటే ఇష్టమని చెప్పాడు.. ఒకవేళ దీపికాకు పెళ్లి కాకుంటే తప్పకుండా అమ్మడి ప్రేమికుల లిస్ట్ లో ఇతను కూడా ఉండేవాడు. పెళ్లి తర్వాత కూడా దీపికా సినిమాలు చేస్తూ అలరిస్తుంది. రణ్ వీర్ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: