యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టెంపర్ ముందు వరకు సీన్ ఎలా ఉన్నా ఆఫ్టర్ టెంపర్ తారక్ సినిమా అంటే చాలు రికార్డులు కొట్టాల్సిందే అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది. కథల విషయంలో ఎంతో పరిణితిగా ఆలోచిస్తున్న ఎన్.టి.ఆర్ తన సహాయం కోరినా కోరకపోయినా చేయడంలో ముందుంటాడు. ఇక అన్న కళ్యాణ్ రామ్ విషయంలో తారక్ చూపే ప్రేమా అభిమానం చూసి ముచ్చటేస్తుంది. అయితే నందమూరి హీరోగా కళ్యాణ్ రామ్ ఇంకా బాక్సాఫీస్ మీద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

 

సినిమాలైతే చెస్తున్నా వాటికి తగినట్టుగా ఫలితాలు అందుకోలేని కళ్యాణ్ రాం కు కథల విషయంలో హెల్ప్ చేస్తున్నారట ఎన్.టి.ఆర్. కళ్యాణ్ రాం హీరోగా చేసే సినిమాల కథలను తను కూడా విని తగిన చేర్పులు మార్పులు చెబుతున్నారట. అంతేకాదు తన దగ్గరకు వచ్చిన కథలను కూడా కళ్యాణ్ రామ్ కు సూట్ అయ్యేలా ఉంటే ఆయన దగ్గరకు పంపిస్తున్నాడట. మొత్తానికి ఎన్.టి.ఆర్ ఈ సహాయంతో కళ్యాణ్ రాం కెరియర్ గాడిన పడితే చాలని అనుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

 

అయినా ఒక హీరో దగ్గరకు వచ్చిన కథను మరో హీరో దగ్గరకు పంపించడం మాములే. కొన్నిసార్లు కథ నచ్చినా డైరక్టర్ అడిగిన డేట్స్ అడ్జెస్ట్ చేయలేక కూడా కొన్ని సినిమాలు మిస్ అవుతుంటాయి. మరి తారక్ కావాలని కళ్యాణ్ రామ్ కథల విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు అంటే తప్పకుండా కళ్యాణ్ రామ్ రాబోయే సినిమాల ఫలితాలు బాగుంటాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఒకటి రెండు కథలు డిస్కషన్స్ లో ఉండగా త్వరలోనే వాటి గురించి అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుందని తెలుస్తుంది. తారక్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తునాడు.. అది పూర్తయ్యాక త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తాడని టాక్.             

మరింత సమాచారం తెలుసుకోండి: