నెపోటిజం వస్తున్నవార్తలను 10 రోజులుగా చూస్తున్న స్టార్ కిడ్స్ ఎట్టకేలకు ఎదురుదాడికి దిగారు. కంగన రనౌత్, దర్శకుడు శేఖర్ కపూర్.. మరికొందరు సెలబ్రెటీలు సుశాంత్ మరణానికి వీళ్లే కారణమంటూ.. డైరెక్ట్ గా.. ఇన్ డైరెక్ట్ గా అలియా.. సోనమ్.. అభిషేక్.. సల్మాన్ ను టార్గెట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య వేడి తగ్గిన తర్వాత తమపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు స్టార్ కిడ్స్. 

 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య తర్వాత బాలీవుడ్ రెండుగా విడిపోయింది. సినిమా బ్యాక్ డ్రాప్ లేకండా పైకి వచ్చిన నటీనటులు ఒక వర్గం అయితే.. వారసత్వం ఉన్న హీరోహీరోయిన్లు మరోవైపు. బంధుప్రీతి వారసత్వంపై విమర్శలు ఎప్పుడూ ఉండేవే అయినా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం తర్వాత పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై అమితాబ్ వారసుడు అభిషేక్ స్పందిస్తూ.. తను స్టార్ హీరో వారసుడినే అయినా.. తన తొలి చిత్రం నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాలేదని వాపోయాడు. టాలెంట్ లేకుండా వారసత్వం ఒకటి రెండు సినిమాలకు పనిచేస్తుందన్నారు. 

 

ఇక సల్మాన్ స్పందిస్తూ... తనపై దాడిని తగ్గించేలా.. సుశాంత్ ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకోవాలని తన అభిమానులకు పిలుపునిచ్చి హుందాతనాన్ని చాటుకున్నాడు. ఇక సోనాక్షి అయితే..  సామాజిక మాద్యమం అకౌంట్ నుంచి బయటికొచ్చేసింది. బంధుప్రీతిపై వస్తున్న విమర్శలకు.. అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్ ఘాటుగా స్పందించింది. ఎవరు ఎవరికి పుట్టాలో.. ఎక్కడ పుట్టాలో కర్మ నిర్ణయిస్తుందని పేర్కొంది. 

 

ఇక అలియా తల్లి సోనీ రజ్జాన్ మాట్లాడుతూ.. ఈ రోజు నెపోటిజం గురించి మాట్లాడుతున్న వాళ్లు ఏదో ఒక రోజు తమ సొంత బిడ్డల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందన్నారు. పిల్లలను ఇండస్ట్రీకి రాకుండా ఆపగలుగుతారా.. అని ప్రశ్నించింది. మొత్తానికి సుశాంత్ ఆత్మహత్యపై ఇప్పటికీ విమర్శలు చల్లారడం లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: