ఆంజనేయుడి పెళ్లి ఎప్పుడంటే.. రేపు అన్నట్టు తెలుగునాట ఇద్దరు హీరోయిన్ల పెళ్లి కూడా ఇలాగే డైలీ సీరియల్ లా కంటిన్యూ అవుతోంది. ట్విస్ట్ లు తప్ప ఎండింగ్ లేని సీరియల్ లా కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకు పెళ్లి ముచ్చట్లలో మునిగిపోయిన చందమామ ఇప్పుడు షూటింగ్ కు వెళ్లిపోయింది. మళ్లీ పెళ్లి మాటను వాయిదా వేసింది. 

 

కాజల్ అగర్వాల్ నిన్ననే పెళ్లి గురించి మాట్లాడింది. పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయ్యేందుకు రెడీగా ఉన్నాననీ.. మంచి కుర్రాడు దొరికితే పెళ్లిపీటలెక్కేస్తానని స్టేట్ మెంట్స్ కూడా పాస్ చేసింది చందమామ. అమ్మానాన్నలు కుర్రాడిని వెతికితే ఏడడుగులు వేస్తానని ఓ లాక్ డౌన్ ఇంటర్వ్యూలో కూడా చెప్పేసింది. 

 

కాజల్ పెళ్లి గురించి ఇలా చెప్పిందో లేదో.. అలా షూటింగ్ కు వెళ్లిపోయింది. రీసెంట్ గానే ముంబయిలో ఒక యాడ్ చేసింది కాజల్. ఇక చందమామ షూటింగ్ లో జాయిన్ కావడంతో ఈమె ఇంకా సినిమాల నుంచి బయటపడట్లేదని.. మ్యారీడ్ లైఫ్ గురించి ఆలోచించడం లేదని కామెంట్స్ వస్తున్నాయి. మరి పెళ్లి గురించి కాజల్ ఏమి అనుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. 

 

కాజల్ కంటే సీనియర్ మోస్ట్ హీరోయిన్ అనుష్క కూడా పెళ్లిని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా మార్చేసింది. బాహుబలి  నుంచి మొదలుపెడితే.. నిశ్శబ్ధం వరకు రోజుకో వార్త వస్తున్నా.. ఒక్కదాన్ని కూడా నిజం చేయడం లేదు జేజెమ్మ. 

 

అనుష్క ఒక వెటరన్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోబోతుందని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పుకార్లపై స్వీటీ ఇంతవరకు రియాక్ట్ కాలేదు. ఇంతకుముందు ప్రభాస్, అనుష్క డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జరిగినప్పుడు కూడా చాలా రోజులు నిశ్శబ్దంగానే ఉంది. ఆ తర్వాత చాలా రోజులకు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే.. అంతకుమించి ఏం లేదని క్లారిటీ ఇచ్చింది బాగమతి. 

మరింత సమాచారం తెలుసుకోండి: