కొరటాల శివ మెగా కాంపౌండ్ లో సెటిల్ అయిపోయాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి మరో హీరోను డైరెక్ట్ చేసేందుకు ఇష్టపడటం లేదు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన బేనర్స్ లో వరుస పెట్టి సినిమాలు తీసేస్తున్నాడు. ఆచార్య తర్వాత కొరటాల ఏ మెగా హీరో డైరెక్ట్ చేస్తున్నాడో తెలుసా.. 

 

కొరటాల శివ, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ చేసినా.. కథ సెట్ కాక పోవడంతో.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. చిరంజీవితో తీస్తున్నఆచార్యతో మెగా కాంపౌండ్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు కొరటాల. అక్కడే రెండేళ్లుగా ఉండటంతో.. ఆ వాతావరణానికి బాగా అలవాటుపడిపోయాడనుకుంట. ఆచార్య తర్వాత కూడా మెగా ఫ్యామిలీ హీరోనే డైరెక్ట్ చేయనున్నాడు కొరటాల. 

 

ఆచార్య తర్వాత కొరటాల శివ.. గీతా ఆర్ట్స్ లో బన్నీతో సినిమాకు కమిట్ అయ్యాడు. ఆల్ రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడని టాక్. పుష్ప మూవీ తర్వాత ఈ కాంబినేషన్ ఉంటుందో లేదో తెలియదు గానీ.. బన్నీ, కొరటాల కాంబినేషన్ ఫిక్స్ అయిందంటున్నాయి మెగా వర్గాలు. కథ సింగిల్ సిట్టంగ్ లో ఓకే అయిందట. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న పుష్ప షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. కొరటాల కలయికలో సినిమా ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టం. 

 

చిరంజీవి కంటే ముందే రామ్ చరణ్ ను కొరటాల డైరెక్ట్ చేయాలనుకున్నా.. ఆచార్యతో ఒకేసారి తండ్రీ కొడుకులను డైరెక్ట్ చేసేశాడు. ఒకదెబ్బకు ఇద్దరు మెగా హీరోలతో వర్క్ చేసిన కొరటాల.. బన్నీని లైన్ లో పెట్టాడు. భరత్ అనే నేను తర్వాత రెండేళ్ల పాటు ఆచార్యతో ఉన్నకొరటాల ఇంకో ఏడాదిపాటు ఇదే మూవీతో కంటిన్యూ అవుతాడు. మూడేళ్ల తర్వాత బన్నీతో జర్నీ.. ఇలా ఓ ఐదేళ్లు మెగా కాంపౌండ్ నే అంటిపెట్టుకొని ఉంటున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: