కరోనా ప్రభావంతో థియేటర్లని మూత పడ్డాయి. ఎప్పుడు తెరుస్తాయి అన్నది ఇంకా ఓ క్లారిటీకి రాలేదు. కేసులు తగ్గుముఖం పడితే ఏమో కాని రోజు రోజుకి లెక్కకు మించి కరోనా కేసులు వస్తున్నాయి. ఈ టైంలో థియేటర్లు ఓపెన్ చేసి సినిమాలు రిలీజ్ చేసినా జనాలు మాత్రం సినిమా హాళ్లకు వెళ్లే పరిస్థితి కనబడటం లేదు. ఇక ఇదిలాఉంటే మీడియం, మినిమం బడ్జెట్ సినిమాలేమో ఓటిటి రిలీజ్ కు మొగ్గు చూపుతున్నారు. అయితే ఓ సినిమా రిలీజ్ అంటే ఆ హంగామా వేరేలా ఉంటుంది.

 

ఎంత మంచి సినిమా చేశామన్న దానితో పాటుగా ఆ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు ఎంత బాగా తీసుకెళ్లాం అన్నది కూడా కౌట్ లోకి వస్తుంది. ఈ క్రమంలో సినిమాకు పబ్లిసిటీ అనేది చాలా ప్రాధాన్యత వహిస్తుంది. స్టార్ సినిమాలైతే పబ్లిసిటీతో మోత మోగించేస్తారు. టివి ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెల్స్, పేపర్లు, వెబ్ సైట్స్ అబ్బో ఇలా ఏంటి రకరకాల ప్రమోషన్స్ తో హడావిడి చేస్తారు. కేవలం స్టార్ సినిమాలే కాదు చిన్న బడ్జెట్ సినిమాలైనా సరే ప్రమోషన్స్ భారీగానే చేస్తారు.

 

అయితే ప్రస్తుతం కరోనా వల్ల సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నా వాటి ప్రమోషన్స్ మాత్రం పట్టించుకోవడం లేదు. సినిమా టీజర్, ట్రైలర్ తో వచ్చిన బజ్ ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చి మమా అనిపించేస్తున్నారు. సినిమా తీసిన దర్శకుడు.. నటించిన హీరోలు రెమ్యునరేషన్ తీసుకుని సైడ్ అవుతున్నారు. ఇక సినిమాకు ప్రతి రూపాయి ఖర్చు పెట్టిన నిర్మాత పెట్టిన బడ్జెట్ వచ్చిన ఓటిటి ఆఫర్ చెక్ చూసుకుని డీల్ సెట్ చేసుకుంటున్నారు. రిలీక్ కాకుండా అలా ఆగిపోవడం కన్నా ఓటిటిలో రిలీజై ఎంతోకొంత ప్రేక్షకాదరణ తెచ్చుకుంటుందనే పొందుతుందని డిజిటల్ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ చేస్తున్నారు.         

మరింత సమాచారం తెలుసుకోండి: