దీపికా పదుకొణె.. ఈ బాలీవుడ్ భామ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన ప్రకాష్ పదుకొణె కుమార్తె అయిన దీపికా.. ఓ శాంతి ఓం చిత్రంతో వెండితెరకి పరిచయమైంది.

ఇక వెండితెరకు పరిచయమైన అనతికాలంలోనే స్టార్ హోదా కైవసం చేసుకుంది ఈ గ్లామర్ బ్యూటీ. లవ్ ఆజ్ కల్, కాక్‌టెయిల్, ఫైండింగ్ ఫన్నే, యే జవానీ హై దీవానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, పికు, పద్మావత్ వంటి చిత్రాలతో అలరించిన దీపికా.. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసింది.

2018లో తన చిరకాల మిత్రుడు, ప్రేమికుడు రణ్‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గడం లేదు. బాలీవుడ్ చిత్రాలతో పాటు ఇటు తెలుగులో ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటించనుంది.

మరోవైపు దీపికా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానులకు పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా కూడా దీపికా హాట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.









క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి