వర్మ ఒకప్పుడు టెక్నికల్లీ బ్రిలియంట్ డైరెక్టర్. ప్రస్తుతం కాంట్రవర్శీ డైరక్టర్. గతంలో ఎంతో మంది ఔత్సాహిక దర్శకులకు రోల్ మోడల్. ప్రస్తుతం దర్శకుడిగా ఎలా ఉండకూడదో చెప్పడానికి వర్మ పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్. వర్మ డైరెక్షన్ లో నటించాలనుకున్న స్టార్స్.. ఇప్పుడాయన పేరెత్తేందుకు భయపడుతున్నారు.
వర్మ టాలెంట్ కు చిరంజీవి కూడా ఫిదా అయిపోయి అవకాశం ఇచ్చాడు. అశ్వనీదత్ నిర్మాత. షూటింగ్ మొదలైంది. ఇద్దరి మధ్య ఇగో క్లాష్ కారణంగా.. చిరంజీవి, వర్మ సినిమా ఆగిపోయిందంటారు. పవన్ తో సినిమా ప్లాన్ చేసినా.. కుదర్లేదు. ఈలోగా వరుస ఫ్లాపులతో నమ్మకాన్ని కోల్పోయాడు వర్మ. మెగా హీరోలే అని కాదు.. నందమూరి.. ఘట్టమనేని హీరోలు ఎవ్వరూ.. తమ కాంపౌండ్ లోని వర్మను రానివ్వలేదు.
ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడిగా బాలకృష్ణ ముందు వర్మను కూడా అనుకున్నాడు. వర్మపై నమ్మకం లేక క్రిష్ తో కథానాయకుడు.. మహానాయకుడు తీశాడు బాలయ్య. ఇది నచ్చని వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసి.. తనకు అవకాశం ఇవ్వని బాలయ్యకు అంకితం చేశాడు.
పెద్ద ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు వర్మ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటాడు. అయితే నాగార్జున మాత్రం.. ఇందుకు మినహాయింపు. దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చాడన్న కృతజ్ఞత కాబోలు. నాగ్ తో క్లోజ్ గా ఉంటాడు. ఇక ఎవ్వరితోనూ వర్మకు పడదు. నాగార్జున ఒక్కడే ఆర్జీవీని గుర్తించాడు. మిగిలన వాళ్లు ఎవ్వరూ పట్టించుకోరు. కెరీర్ ను మలుపు తిప్పిన శివ ఇచ్చాడన్న నమ్మకంతో వర్మ దర్శకత్వలో అంతం.. గోవింద గోవింద.. ఆ మధ్య ఆఫీసర్ మూవీ చేస్తే ఒక్కటీ విజయం సాధించలేదు.
శివ లాంటి ట్రెండ్ సెట్టర్ మూవీ ఇవ్వడంతో.. సుమంత్ ను హీరో చేసే బాధ్యతను వర్మకు అప్పజెప్పాడు వర్మ. సుమంత్ తో తీసిన ప్రేమ కథ డిజాస్టర్ అయింది. రాను రాను వర్మలో టాలెంట్ ఆవిరైపోవడంతో నాగచైతన్య, అఖిల్ విషయంలో వర్మ వైపు చూడలేదు నాగార్జున. అసలే ఈ ఇద్దరి పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇక వర్మ చేతిలో పెడితే మటాషేనన్న సంగతి నాగ్ కు బాగా తెలుసు. అందుకే.. వర్మ దర్శకత్వంలో వారసులతో సినిమాలు ప్లాన్ చేయలేదు నాగ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి