సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ముందు రమేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా సరే బాలనటుడిగా మహేష్ స్మార్ట్ గా కనిపించాడు. ఇక రాజకుమారుడుతో హీరోగా మారి సూపర్ హిట్ అందుకున్నాడు. రాఘవేంద్ర రావు డైరక్షన్ లో వచ్చిన రాజకుమారుడు సినిమాలో తన నటనతో మెప్పించాడు మహేష్. ఇక యువరాజు, వంశీ సినిమాలు కొద్దిగా నిరాశపరచాయి. మురారితో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. 

 

తను చేసే ఎలాంటి పాత్రకైనా సరే 100 శాతం అవుట్ పుటి ఇవ్వడానికి కష్టపడతాడు మహేష్. అందుకే మహేష్ సూపర్ హిట్ అయిన సినిమాలే కాదు ఫ్లాపైన సినిమాల్లో కూడా అతని నటన అద్భుతంగా ఉంటుంది. హిట్టు, ఫ్లాపులు కేవలం కలక్షన్స్ కోసమే.. అందుకే డైరక్టర్ ఫెయిల్ అయితేనే మహేష్ ఫెయిల్ అవుతాడు. కాని తను ఎంచుకున్న పాత్ర పరంగా అభినయంలో మహేష్ ఎప్పుడు ది బెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చాడు కాని ఫెయిల్ అవలేదు. మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్లతో పాటుగా భారీ డిజాస్టర్స్ ఉన్నాయి. 

 

జయంత్ డైరక్షన్ లో వచ్చిన టక్కరి దొంగ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. మహేష్ కౌబోయ్ గెటప్ లో కొత్తగా చేశాడు. అయితే ఆ సినిమా కథ, కథనాలు పెద్దగా మెప్పించలేదు. ఫలితంగా సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక ఎస్.జె సూర్య డైరక్షన్ లో వచ్చిన నాని సినిమా కూడా అంతే.. 12 గంటలు పిల్లాడిలా.. 12 గంటలు పెద్దవాడిలా మహేష్ నటన అలరిస్తుంది. కాని సినిమా ఫ్లాప్ అయ్యింది. ఖలేజా సినిమా కూడా అంతే.. మహేష్ లోని కామెడీ యాంగిల్ ను బాగా వాడుకున్నాడు త్రివిక్రం. కాని ఆ సినిమాకు ముందు మూడేళ్ళు గ్యాప్ రావడంతో ఆడియెన్స్ దాన్ని సరిగా రిసీవ్ చేసుకోలేకపోయారు.

 

సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాలో మహేష్ నటన అద్భుతంగా ఉంటుంది కాని ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. మహేష్ కెరియర్ లో మరో భారీ డిజాస్టర్ బ్రహ్మోత్సవం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలకు మరో ఛాన్స్ ఇవ్వగా ఆయన బ్రహ్మోత్సవం తీసి ఫ్లాప్ ఇచ్చాడు. ఇక భరత్ అనే నేను నుండి మహేష్ ప్రతి సినిమా హిట్టు కొడుతూ ఉన్నాడు. శ్రీమంతుడిగా.. మహర్షిగా.. సరిలేరు నీకెవ్వరు మహేష్ అనిపించుకుంటూ కెరియర్ లో మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: