ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా మరో సంవత్సరం వరకు సినిమా థియేటర్ లు తెరుచుకునే అవకాశం లేదు అంటూ తెలిపాడు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు విడుదల కావాల్సిన సినిమాలన్నీ ఓటిటి లోనే విడుదల అవుతాయని... దీంతో సినీ ప్రేక్షకులు అందరూ సినిమా థియేటర్లకు వెళ్లి సినిమా చూడడం కంటే.. ఇంట్లో కూర్చొని ఓటిటి లో సినిమా చూడడానికి ఎక్కువగా అలవాటు పడిపోతారు అంటూ రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. సంవత్సరం తర్వాత సినిమా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఆ తర్వాత ఓటిటి కి అలవాటుపడ్డ సినీ ప్రేక్షకులు థియేటర్ లకి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని వర్మ వ్యాఖ్యానించాడు.
ఈ నేపథ్యంలో ఎంత పెట్టుబడి పెట్టిన ఎంతో భారీ బడ్జెట్ సినిమా అయినప్పటికీ 30 నుంచి 40 శాతం మాత్రమే వసూలు వస్తాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు వర్మ. అయితే వర్మ చేసిన వ్యాఖ్యలు నిజమైతే రాజమౌళి పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం సినీ ప్రేక్షకుల మదిలో మెదులుతున్న ప్రశ్న. 400 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత దాదాపుగా 500 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టాలి. అలా జరగలేదు అంటే నిర్మాతలకు నష్టాలు తప్పవు. మరి వర్మ చెప్పిన విధంగా జరిగితే మాత్రం రాజమౌళికి భారీ షాక్ తగులుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి