ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన ధీమాతోనో.. లేక నేను తీసిందే సినిమా చూస్తే చూడండి లేదంటే లేదు అనే సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తున్న వర్మ ఇలాంటి టైం లో చూసి సినిమాలు తీసి ATTలో రిలీజ్ చేస్తున్నాడు. క్లైమాక్స్, నగ్నం సినిమాలతో పాటుగా పవర్ స్టార్ సినిమాను కూడా జూలై 25న రిలీజ్ చేస్తున్నాడు. ఇండస్ట్రీలో ఎవరి జోలికి అంత తేలికగా పోని ఆర్జీవి మెగా ఫ్యామిలీ అంటే మాత్రం అంతెత్తున లేస్తాడు.

                 

పవన్ కళ్యాణ్ ను అభిమానినని చెప్పుకుంటూనే ఆయాన్ను ఎప్పుడూ టార్గెట్ చేస్తాడు. మొన్నటివరకు కేవలం పవన్ కళ్యాణ్ ను ఆయన ఫ్యాన్స్ ను టార్గెట్ చేసిన వర్మ అది సరిపోదు అన్నట్టుగా సినిమా కూడా తీశాడు. మెగా ఫ్యామిలీ మీద తన కసి మొత్తాన్ని ఈ సినిమాతో వెళ్ళగక్కుతున్న ఆర్జీవిని సరైన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు మెగా హీరోలు.  

  

అదెలా అంటే ఇక మీదట ప్రతి మెగా హీరో సినిమాలో విలన్ ను వర్మతో పోల్చుతూ అతని పైత్యాన్ని తగ్గించేలా డైలాగ్స్ తో బుద్ధి చెప్పాలని అనుకుంటున్నారట. చిరంజీవి దగ్గర నుండి సాయి తేజ్ సినిమా వరకు అందరి సినిమాల్లో అందరి టార్గెట్ ఆర్జీవినే. డైరెక్ట్ గా అతనితో గొడవపడటం కన్నా సినిమా డైలాగ్స్ తో అతనికి బుద్దిచెప్పాలని అనుకుంటున్నారట. మరి అది సాధ్యమయ్యే విషయమా కాదా అన్నది చూడాలి. ఒకవేళ మెగా ఫ్యామిలీ హీరోలు అలా చేస్తే ఇప్పుడు కేవలం పవర్ స్టార్ తోనే వదిలిపెట్టే ఆలోచనలో ఉన్న ఆర్జీవి. మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరి గురించి సినిమాలు తీసినా తీస్తాడని చెప్పుకోవచ్చు.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: