కాజల్ అగర్వాల్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్ మధ్య ఏం ఉంది. సీనియర్ మోస్ట్ హీరోయిన్ కు, ఇప్పుడిప్పుడే సక్సెస్ టెస్ట్ చేస్తున్న కుర్రాడికి మధ్య ఏం నడుస్తోంది. రెండు సినిమాలతోనే వీళ్లిద్దరి మధ్య డీప్ రిలేషన్ స్టార్ట్ అయిందా అని నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రీ జనాలు కూడా వీళ్ల కెమిస్ట్రీ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఏం నడుస్తుందో తెలుసా. 

 

కాజల్ అగర్వాల్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్ రిలేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వీళ్లిద్దరి ఇన్ స్టాగ్రామ్ స్టోరీలు చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కంటే పెద్ద రిలేషన్ ఉందని మాట్లాడుకుంటున్నారు. కొంతమందైతే కాజల్, బెల్లంకొండ ఇద్దరు డేటింగ్ లోఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. 

 

కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని.. చందమామ త్వరలో పెళ్లి పీటలెక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో కాజల్ ఇన్ స్టా టైమ్ లో ఒక పోస్ట్ పెట్టింది. బెల్లం కొండ శ్రీనివాస్ తో కలిసున్న ఫోటోకి నేను నిన్ను మిస్ అవుతున్నాను అని కామెంట్ పెట్టిందట.

 

కాజల్ పోస్ట్ కు బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కూడా ఇలాగే రియాక్ట్ అయ్యాడు. నేనూ నిన్ను మిస్ అవుతున్నాను. కానీ ఇప్పుడు కలవలేము అన్నట్టు రిప్లై ఇచ్చాడు. ఈ కామెంట్ లు చూసి వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే కామెంట్ లు పెడుతున్నారు జనాలు. మరి కవచం, సీత సినిమాల్లో జోడీగా నటించిన వీళ్లిద్దరు రియల్ లైఫ్ లో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తారో చూడాలి. మొత్తానికి బెల్లం కొండ సాయి శ్రీనివాస్, కాజల్ మధ్య ఏదో జరుగుతుందనే టాక్ జనాల్లో నానుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: