వయసు పెరుగుతుంటే.. వన్నె తగ్గుతూ ఉంటుంది. గ్లో పెరిగేందుకు సీనియర్ హీరోయిన్స్ చేయని ప్రయత్నము ఉండదు. 24 గంటల్లో సగం టైమ్ బ్యూటీ టిప్స్ కోసమే ఆలోచిస్తారు. సమంత ఇండస్ట్రీకి వచ్చి 11 ఏళ్లు అయింది. ఫేస్ లో కళ తగ్గుతోందని వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చింది.
ఫేస్ లో గ్లో తగ్గడంతో స్టార్ హీరోలు ఈ అమ్మడిని పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వైపు యు టర్న్ తీసుకొని కెరీర్ సాగిస్తోంది సామ్స్. ఫేస్ లో ఆనాటి నునుపు కోసం ఎన్నిప్రయోగాలు చేసినా ఫలితం దక్కలేదు.
పూర్వ వైభవం కోసం కరోనా కష్టకాలాన్ని ఉపయోగించుకుంటూ.. యోగా స్టార్ట్ చేసింది. దీనికి తోడు.. బత్తాయి.. నిమ్మ తొక్కలతో థెరపీ చేయించుకుంది. ఇవన్నీ సమంత ఒంటిపై బాగా పనిచేశాయి. ఫేస్ లో కళ మళ్లీ తాండవిస్తోంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన మూడు స్టిల్స్ తో మళ్లీ మాయ చేసింది సమంత.
రొమాంటిక్ టచ్ ఇచ్చిన హాట్ స్టిల్స్ తో సామ్స్ మళ్లీ పెద్ద సినిమా ఆఫర్స్ కొట్టేస్తుందో లేదో చూడాలి. స్నేహితురాలు శిల్పారెడ్డి ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేస్తూ.. లేటెస్ట్ గా డిఫరెంట్ యాంగిల్ లో బ్లాక్ అండ్ వైట్ స్టిల్ పోస్ట్ చేసింది సామ్స్ . డిఫరెంట్ సైడ్స్, డిఫరెంట్ షేడ్స్.. డిఫరెంట్ ఎమోషన్స్.. డిఫరెంట్ ఫీలింగ్స్.. ఇవన్నీ ఒక్క దాంట్లోనే అంటూ హీట్ ఎక్కించింది.
ఒక్క స్టిల్ లో డిఫరెంట్ యాంగిల్స్ చూపించిన సామ్స్ లో అపరిచితుడు మాదిరి రకరకాల షేడ్స్ కూడా ఉన్నాయి. టెర్రస్ గార్డెనింగ్, ఫేస్ థెరపీ.. యోగా అంటూ.. కరోనా కష్టకాలాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని.. కొత్తగా తయారైంది సామ్స్. యోగా పాఠాలు శ్రీవారికి కూడా చెప్పిందనుకుంట. ఆ మధ్య చైతు శీర్షాసనంలో కనిపించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి