కాస్త లావైనా.. వెయిట్ ఉన్నట్టుండి 10కేజీలు తగ్గినా.. పోలికలతో ఆ వ్యక్తిని గుర్తుపట్టొచ్చు. హెయిర్ స్టైల్ మార్చినా.. బియర్డ్ డిఫరెంట్ గా మెయిన్ టైన్ చేస్తున్నా.. కనిపెట్టేయొచ్చు. కానీ ఓ యంగ్ హీరోను గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే.. లుక్ కోసం ఫుల్ గా మేకోవర్ అయ్యాడు.
నాగశౌర్యకు చాలా మంది యంగ్ స్టార్స్ పోరాడాల్సి వస్తోంది. విజయ్ దేవరకొండ.. నాని.. శర్వానంద్..నితిన్..రామ్ లాంటి కుర్రకారు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఏదో రెగ్యులర్ గా.. రొటీన్ గా కనిపిస్తే.. నిలబడటం కష్టమే. కథలో కొత్తదనం ఉంటాలి. దీనికి తగ్గట్టు.. మేకోవర్ అవ్వాలి. ఈ క్రమంలో తన 20వ సినిమా కోసం.. సిక్స్ ప్యాక్ తీసుకొచ్చాడు ఈ కుర్ర హీరో.
సింపుల్ గా.. లవర్ బాయ్ గా కనిపించే నాగశౌర్య జీన్స్ వేసుకున్న మన్నెం వీరుడిలా కనిపిస్తున్నాడు. సంతోష్ జాగర్ల మూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో క్యారెక్టర్ ఏమిటో గానీ.. ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. షూటింగ్ లో మధ్యలో కరోనా వచ్చింది. దీంతో ఇంటి దగ్గరే ఇదే బాడీని మెయిన్ టేన్ చేస్తూ.. కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఆ మధ్య వర్కవుట్స్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.
విల్లు పట్టిన నాగశౌర్యను చూస్తుంటే..కేరళ నుంచి వచ్చిన హీరోగా కనిపించాడు. నాగశౌర్య అని చెబితే గానీ గుర్తు పట్టడం కష్టం. మొహం సగం పీక్కు పోగా గడ్డం పెంచాడు. దీనికి తోడు పెంచిన జుట్టును ముడి వేశాడు. అశ్వద్థామ అంటూ సస్పెన్స్ థ్రిల్లర్ ట్రై చేసి ఓకే అనిపించుకున్న నాగశౌర్య.. కొత్త సినిమాతో ఫస్ట్ లుక్ తో షాక్ ఇచ్చాడు. ఈ స్టిల్ ను శేఖర్ కమ్ముల రిలీజ్ చేసి.. బాడీని మార్చుకున్న తీరు తనకు ఆశ్చర్యమేసిందన్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి