బిగ్ బాస్ సీజన్ 4 త్వరలోనే మొదలుకాబోతుంది. 3వ సీజన్ హోస్ట్ గా చేసిన కింగ్ నాగార్జుననే ఈ సీజన్ కూడా హోస్ట్ గా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే షోలో పాల్గొనే కంటెస్టంట్స్ గురించి రోజుకో లిస్ట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఓ పక్క కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్నా సరే బిగ్ బాస్ మాత్రం ఆగేది లేదని అంటున్నారు నిర్వాహకులు. అయితే ఆంక్షలతో కూడిన టాస్కులు, షో అంతా కూడా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట.

 

ఈ సీజన్ హోస్ట్ గా ముందు స్టార్స్ కు ట్రై చేయగా వారెవరు చేయనని చెప్పడంతో బిగ్ బాస్ సీజన్ 4కి కూడా నాగ్ హోస్ట్ గా రాబోతున్నాడు. ఈ సీజన్ కోసం నాగార్జున భారీ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. సీజన్ 3, 100 రోజుల ఎపిసోడ్ తనకు అప్పుడు రెమ్యునరేషన్ గా బాగానే ఇచ్చారట. కాని ఈ సీజన్ లో అంతకుమించి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. అంతేకాదు నాగార్జునకు ఎపిసోడ్ వైజ్ గా రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారట.  

 

అలా అయితే నాగార్జునకు బిగ్ బాస్ షో ద్వారా భారీగానే వస్తాయని అంటున్నారు. అంతేకాదు ఈసారి రిస్క్ తీసుకుని మరి వస్తున్న కంటెస్టంట్స్ కు కూడా ఫ్యాన్సీ రెమ్యునరేషన్ ఇస్తున్నారట. కంటెస్టంట్స్ లో కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ అయితే టోటల్ ప్యాకేజ్ రూపంలో మాట్లాడతారు. వేరే వాళ్ళకు మాత్రం డైలీ పేమెంట్ గా ఉంటుందట. వారానికే ఎలిమినేట్ అయితే ఒకరేటు.. రెండ వారం మరో రేటు.. ఇలా అన్ని రోజులకు కలిపి లెక్కకట్టి ఇస్తారట. బిగ్ బాస్ సీజన్ 4 ఈసారి కేవలం 50 రోజులు మాత్రమే ఉంటుందని తెలుస్తుంది.  టైటిల్ గెలిస్తే ఇచ్చే ప్రైజ్ మనీ కూడా తగ్గ్గించారట. ఏది తగ్గించినా సరే నాగార్జున రెమ్యునరేషన్ మాత్రన్ అడిగినంత ఇచ్చేస్తున్నారని తెలుస్తుంది.  
                    

మరింత సమాచారం తెలుసుకోండి: