సినిమా చూసిన సెలబ్రిటీస్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుంటే ప్రముఖ గేయ రచయిత భస్కర భట్ల ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఇంతకీ సినిమా చూసిన ఆయన ఏమంటున్నారు అంటే.. మనసు పొరల్లో గట్టిగా తిష్ట వేసుకుని కూర్చునే సినిమా ఇది. ఎటెటో వెళ్ళిపోయే జీవితాన్ని తిరిగి మన 'చెప్పు'చేతల్లో తెచ్చుకోవడమే నిజమైన గెలుపంటే. ఈ విషయాన్ని 'మహా'ద్భుతంగా చెప్పిన చిత్రమే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. అందరు తమ తమ పాత్రల్లో అలవోకగా పరకాయ ప్రవేశం చేశారు. సత్య దేవ్ కు ఇది నిజంగా మేలి మలుపు చిత్రం. ఇది నా అభిప్రాయం అంటూ భాస్కర భట్ల సినిమా కాన్సెప్ట్ అయిన చెప్పుల ఫోటోతో ఈ మెసేజ్ పెట్టారు.
కంచెరపాలెంతో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసిన వెంకటేష్ మహా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో కూడా అంచనాలను అందుకున్నాడు. ఈ సినిమా సడెన్ రిలీజ్ అయినా కూడా సినిమా రెస్పాన్స్ బాగుంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సూపర్ అనేస్తున్నారు. దానికి తోడు సినిమా చూసిన సెలబ్రిటీస్ మంచి ప్రశంసలు అందుకుంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి