ఆర్జీవి వరల్డ్ నుండి మరో సినిమా రిలీజ్ కాబోతుంది. సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ లాక్ డౌన్ టైంలో మరింత ఫోకస్ గా పనిచేస్తున్నాడు. ఈ టైం లో షూటింగులకు అందరు దూరంగా ఉంటుంటే ఆర్జీవి మాత్రం వరుస సినిమాలు చేస్తూ హంగామా సృష్టిస్తున్నాడు. ఇదిలాఉంటే ఆర్జీవి లేటెస్ట్ మూవీ థ్రిల్లర్ సినిమా కూడా రిలీజ్ ఫిక్స్ చేశాడు. ఆగష్టు 14 రాత్రి 9 గంటలకు ఆర్జీవి వరల్డ్ లో థ్రిల్లర్ మూవీ రిలీజ్ కాబోతుంది.

థ్రిల్లర్ సినిమాలో అప్సరా రాణి నటించింది. ఈ సినిమాలో అమ్మడి అందాలను బాగా వాడేసుకున్నాడు అర్జీవి. ట్రైలర్ చూస్తేనే బాబోయ్ అనిపించేసిన అప్సర ఇక సినిమాలో మరింత రెచ్చిపోయిందని చెప్పొచ్చు. అప్సర అందాల కోసం ఆర్జీవి ఫిక్స్ చేసిన రేటు 200 రూపాయలు. అవును ఏటిటిలో రిలీజ్ అవుతున్న థ్రిల్లర్ మూవీకి ఆర్జీవి 200 రూపాయల టికెట్ ప్రైజ్ ఫిక్స్ చేశాడు. పే పర్ వ్యూ ద్వారా థ్రిల్లర్ సినిమా చూడాలంటే 200 పెట్టాల్సిందే.  

సినిమా టైటిల్.. ట్రైలర్ కూడా భయంకరంగా చూపించిన ఆర్జీవి ఓ పక్క అప్సరా అందాలను మాత్రం హైలెట్ చేస్తూ వచ్చాడు. అంకేత మహరాణని కాస్త తన సినిమా కోసం అప్సర రాణిగా మార్చిన వర్మ ఈ సినిమాతో అమ్మడికి బ్రేక్ ఇచ్చేలా ఉన్నాడు. ఇక ఆర్జీవి వెబ్ మూవీస్ లు ట్రైలర్ చూసి ఊరుకుంటే చాలు.. అనవసరంగా సినిమా చూసి టైం వేస్ట్ చేయడం ఎందుకు అనుకునే వారు ఉన్నారు. మరి ఈ థ్రిల్లర్ విషయంలో అయినా ఆర్జీవి అసలు టాలెంట్ చూపిస్తాడో లేదో చూడాలి. థ్రిల్లర్ సినిమా నిరాశపరిస్తే మాత్రం ఆర్జీవి ఇక ఇలాంటి సినిమాలు చేసినా చూసేందుకు ప్రేక్షకులు మాత్రం ఇంట్రెస్ట్ చూపించరు. క్లైమాస్ 100, నగ్నం 200 రూపాయల టికెట్ రో రిలీజ్ చేసిన ఆర్జీవి థ్రిల్లర్ కు 200 ప్రైస్ ఫిక్స్ చేశాడు. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: