అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా వేణు శ్రీరాం డైరక్షన్ లో చేస్తున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ మూవీ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా లైన్ లో ఉంది. ఈ రెండిటి తర్వాత హరీష్ శంకర్ రెడీగా ఉన్నాడు. ఈసారి గబ్బర్ సింగ్ ను మించే సినిమా తీస్తా అంటున్నాడు హరీష్ శంకర్. ఇక ఇదిలాఉంటే ఈ సినిమాల తర్వాత పవర్ స్టార్ నెక్స్ట్ సినిమా రేసులో టాలీవుడ్ ముగ్గురు టాప్ డైరక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి.

అందులో ఒకరు త్రివిక్రం కాగా.. మరొకరు సుకుమార్.. మూడవ డైరక్టర్ సురేందర్ రెడ్డి. త్రివిక్రం తన ప్రతి కథను పవర్ స్టార్ కోసమే రాస్తాడని తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి చేసే సినిమా ఎప్పుడు అంచనాలను మించి ఉంటుంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో ఈ ఇద్దరు సూపర్ హిట్ అందుకోగా హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయ్యింది. అయితే మరోసారి త్రివిక్రంతో పవన్ సినిమా ఉంటుందని టాక్.

ఇక రంగస్థలం సినిమా దర్శకుడు సుకుమార్ తో కూడా పవన్ సినిమా ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు మెగా డైరక్టర్ గా ముద్ర వేసుకున్న సురేందర్ రెడ్డి కూడా పవన్ తో సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ తో రేసు గుర్రం, రాం చరణ్ తో ధృవ, చిరుతో సైరా సినిమాలు చేసిన సురేందర్ రెడ్డి ఈసారి పవన్ ను డైరెక్ట్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ ముగ్గురిలో పవన్ ఎవరికి ఓటు వేస్తాడన్నది తెలియాల్సి ఉంది.                        

మరింత సమాచారం తెలుసుకోండి: