అలాగే ఈ సినిమాకు కూడా మొదట్లో ఓటీటీ మంచి ఆఫర్ నే ఇచ్చింది ... అయినా సరే ఈ సినిమా ఎప్పటికైనా థియేటర్లలోనే రిలీజ్ చేస్తానంటూ భీష్మించుకు కూర్చున్నాడు నిర్మాత దిల్ రాజు. కానీ ఇప్పుడు ఆయన ఆలోచన మారిందట ఓటీటీ ఇచ్చిన బంపర్ ఆఫర్ చూసి లెక్కల సరిపోయాయి అంటూ ఓకే అని ఒప్పందం కుదుర్చుకున్నారట దిల్ రాజు. ఈ సినిమాకు 25 కోట్లు ఖర్చు కాగా అమెజాన్ ప్రైమ్ 33 కోట్లు ఆఫర్ చేయడంతో దిల్ రాజు ఫిదా అయిపోయారు. ఇంకా ఎక్కువ కాలం లేట్ చేస్తే అసలుకే మోసం వస్తుంది అనుకొని... కట్టాల్సిన వడ్డీలను దృష్టిలో పెట్టుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు దిల్. ఈ మధ్య ఒప్పందం మళ్లీ క్యాన్సిల్ అయింది అంటూ రూమర్స్ వస్తే, వాటికి చెక్ పెట్టే విధంగా సెప్టెంబర్ 6న వి సినిమా ఓ టి టి లో రిలీజ్ కు సిద్ధమైనట్లు ప్రకటించారు దిల్ రాజు.
అమెజాన్ ప్రైమ్ మంచి ఆఫర్ ఇవ్వడంతో ఈ సినిమాను ఓ టి టి లో సెప్టెంబర్ 5న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది "వి" చిత్ర బృందం. ఇంకేముంది నాని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఎప్పుడెప్పుడు తమ కళ్ల ముందుకు "వి" సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. విడుదల కాకముందే హిట్ టాక్ ను అందుకున్న సినిమా ప్రేక్షకుల అంచనాలకు సరితూగుతుందో లేదో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి