శ్రుతీ హాసన్ బ్రేకప్ తర్వాత సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. మైఖెల్ కోర్సలేతో విడిపోయాక, కెరీర్ పై కాన్సన్ ట్రేట్ చేసింది. తెలుగు, తమిళ్, హిందీ ఇలా పరిచయమున్న ప్రతీ ఇండస్ట్రీలో సినిమాలకి సైన్ చేసింది. అయితే ఎంత ట్రై చేస్తోన్నా శ్రుతీ కెరీర్ మాత్రం జోరందుకోట్లేదు. పైగా డేంజర్ జోన్ కి మరింత దగ్గరవుతోంది.
శ్రుతీ హాసన్ బాలీవుడ్ లో విద్యుత్ జమాల్ తో కలిసి ‘యారా’ అనే సినిమా చేసింది. ఈ మూవీ రీసెంట్ గానే ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే కరోనా లాక్ డౌన్ తో థియేటర్ గేటు తొక్కుండా డిజిటల్ స్ట్రీమింగ్ లోకి వచ్చిన ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వస్తోంది. శ్రుతీ పెర్ఫామెన్స్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం లేదు.
శ్రుతీ హాసన్ తెలుగులో రవితేజతో ‘క్రాక్’అనే సినిమా చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’కి ఓకే చెప్పింది. అయితే రవితేజ ఇప్పుడు స్లంపులో ఉన్నాడు. ఈ మూవీపై ట్రేడ్ సర్కిల్స్ లో పెద్దగా అంచనాల్లేవు. ఇక ‘వకీల్ సాబ్’లో శ్రుతీ క్యారెక్టర్ ఎక్సుటెండెడ్ క్యామియో రేంజ్ లో ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్స్ తో శ్రుతీ కెరీర్ తో పెద్దగా మార్పులొచ్చేలా కనిపించట్లేదని సినీజనాలు చెప్పుకుంటున్నారు. దీంతో శ్రుతీ కెరీర్ క్లైమాక్స్ కి వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి శృతిహాసన్ చాలా ఆశలే పెట్టుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో తానేంటో నిరూపించుకోవాలని భావిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి