ఇండస్ట్రీలో రెండో సినిమాపై నెగిటివ్ టాక్ ఉంది. తొలి సినిమాతో మెప్పించిన దర్శకులు రెండో ప్రయత్నంలో చేతులేత్తేస్తున్నారు. దీంతో రెండో సినిమా అనేది దర్శకులకు పరీక్షగా మారింది. ఇలాంటి బాక్సాఫీసు సవాల్ ను కొందరు దర్శకులు ఎదుర్కోలేకపోయినా.. చాలా మంది దర్శకులు ఈజీగానే దాటేశారు.
భీష్మ సినిమాతో యంగ్ డైరెక్టర్ వెంకి కుడుముల ద్వితీయవిఘ్నం దాటేశాడు. రోటీన్ ఫార్మూలా కథకే కామెడి టచ్ ఇచ్చి ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాడు. సేంద్రీయ వ్యవసాయం కాన్సెప్ట్ ని ఎంటర్ టైనింగ్ చెప్పి బాక్సాఫీసు వద్ద సేఫ్ అయ్యాడు. నితిన్ కామెడి టైమింగ్, రష్మీకతో లవ్ ట్రాక్ సాంగ్స్ ఇలా అన్ని సమపాళ్లలో మిక్స్ చేసి మలి సినిమాను బాక్సాఫీసు హిట్ గా నిలబెట్టాడు.
తొలి సినిమా ఛలోతో తొలి సక్సెస్ దక్కించుకున్న వెంకి కుడుముల భీష్మతో అంతకు మించిన సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. ఛలో సినిమాలో కామెడికి ఎక్కువ స్కోప్ ఇచ్చిన ఈ యువ దర్శకుడు భీష్మ సినిమా విషయంలోనూ అదే ఫార్మూలాను ఫాలో అయ్యాడు. బ్యాక్ టూ బ్యాక్ రెండు సక్సెస్ లు సాధించిన దర్శకుల జాబితాలో ప్లేస్ దక్కించుకున్నాడు.
మరో యువ దర్శకుడు గౌతమ్ తిన్నూరి తొలి మలి సినిమాలతో మ్యాజిక్ చేశాడు. సుమంత్ హీరోగా నటించిన మళ్లీరావా సినిమాతో దర్శకుడిగా ఏంట్రీ ఇచ్చిన గౌతమ్ తిన్నూరి తొలి సినిమాతోనే టేస్ట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు సక్సెస్ లే లేని సుమంత్ కి మళ్లీ రావాతో మంచి విజయం అందించాడు.
మళ్లీరావా సినిమా నేరేషన్ కి ప్లాటైనా నేచురల్ స్టార్ నాని, గౌతమ్ తిన్నూరిని పిలిచి జెర్సీ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. నాని నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యువ దర్శకుడు జెర్సీ సినిమాను విజయంగా మలిచాడు. మూస యాక్టింగ్ చేస్తున్నాడన్న నాని జెర్సీతో విమర్శకుల నోళ్లు మూయించాడు. క్యారెక్టర్ లో దమ్ముంటే తనలోని నటుడు ఏ స్థాయిలో మెప్పిస్తాడనేది జెర్సీతో మరోసారి నిరూపించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి