నాచురల్ స్టార్ నాని హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా V. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కొన్నాళ్ళుగా ఉన్న రిలీజ్ కన్ ఫ్యూజన్ కు తెర దించుతూ ఓటిటి రిలీజ్ కన్ఫాం చేశారు. అమేజాన్ ప్రైం లో సెప్టెంబర్ 5న నాని v రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ విషయమై నాని తన ట్విట్టర్ లో స్పెషల్ మెసేజ్ పెట్టాడు. v డిజిటల్ రిలీజ్ అవుతున్న సందర్భంగా గత 12 ఏళ్ళుగా నాకోసం మీరు థియేటర్ కు వచ్చారు. ఇప్పుడు మీకోసం మీ ఇంటికి థ్యాంక్యూ చెప్పడానికి వస్తున్నా. మీ రెస్పాన్స్ కోసం అంతే ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నా అంటూ నాని మెసేజ్ పెట్టాడు.

సెప్టెంబర్ 5న Vని సెలెబ్రేట్ చేసుకుందాం అంటూ నాని తన ఫ్యాన్స్ అండ్ వెల్ విషర్స్ కు స్పెషల్ మెసేజ్ పెట్టాడు. నాని v గురించి తెలుసుకోవాల్సిన మరో విశేషం ఏంటంటే నాని హీరోగా నటించిన మొదటి సినిమా అష్టా చమ్మా సినిమా కూడా సెప్టెంబర్ 5న రిలెజైంది. అంతేకాదు ఆ సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ చేశారు. మళ్ళీ అదే దర్శకుడితో చేసిన v డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో నాని పూర్తిస్థాయిలో నెగటివ్ రోల్ లో నటించాడు.                
నానితో పాటుగా ఈ మూవీలో సుధీర్ బాబు కూడా నటించాడు. నివేదా థామస్, అదితిర్ రావు హైదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించారు. మరి ఓటిటి లో రిలీజ్ అవుతున్న నాని వికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. నాని చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.  

       

మరింత సమాచారం తెలుసుకోండి: