కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా తీస్తున్నాడు చిరంజీవి. కమర్షియల్ కమ్ మెసేజ్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ 2020 దసరాకు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్‌తో షూటింగ్‌లకు బ్రేకులు పడ్డాయి. కరోనా ఉధృతి తగ్గేవరకు మళ్లీ షూటింగులు మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇక చిరంజీవి అయితే అన్నీ సర్దుకున్నాక షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు.
‘ఆచార్య’షూటింగ్ ని వచ్చే జనవరి లో రీస్టార్ట్ చేయాలనుకుంటోంది కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ. లాంగ్ షెడ్యూల్స్ తో మూడు నెలల్లో బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చెయ్యాలని టార్గెట్ గా పెట్టుకుంటున్నారట. సో ఏప్రిల్ ఎండింగ్ కి ఫస్ట్ కాపీ రెడీ చేసి ‘ఆచార్య’ని మే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారట దర్శక నిర్మాతలు.
ఇక రెండేళ్లుగా ఎదురుచూస్తోన్న అభిమానులను మరో ఏడాది పాటు ఈ వెయిటింగ్ మోడ్ లోనే పెట్టాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సమ్మర్ లోనే అభిమానుల ఎదురుచూపులకు తెరదించాలనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి, ఈ వెయిటింగ్ కి వడ్డీతో కలిపి వేసవి వినోదం అందించాలని డిసైడ్ అవుతున్నాడు.
పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ తర్వాత ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి వెళ్లాడు. 2019 ఎన్నికల్లో పోటీ కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అయితే రెండేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పవన్ మళ్లీ ‘వకీల్ సాబ్’తో ఫ్లాష్ లైట్స్ మధ్య అడుగుపెట్టాడు. హిందీ హిట్ ‘పింక్’ని ‘వకీల్ సాబ్’గా రీమేక్ చేస్తున్నాడు పవన్.
‘వకీల్ సాబ్’ని సమ్మర్‌లోనే రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ ప్రీ సమ్మర్‌లో వచ్చిన కోవిడ్-19 పవన్ ఆలోచనాలకు బ్రేకులేసింది. ఇక అప్పటినుంచి కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో ఈ వైరస్‌కు టీకా వచ్చే వరకు షూటింగ్‌లో జాయిన్ కాకూడదని డిసైడ్ అయ్యాడు పవన్ కళ్యాణ్.
2020 ఎండింగ్‌కి కరోనా వైరస్ కి టీకా వస్తుందని శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు. సో టీకా మార్కెట్‌లోకి రాగానే 2021 బిగినింగ్‌లో రెగ్యులర్ షూటింగ్స్ మొదలుపెట్టాలనుకుంటున్నాడు పవన్. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ షూటింగ్ 60 శాతం పూర్తయ్యింది. సో మిగిలిన ఫార్టీ పర్సంట్ ని రెండు నెలల్లో పూర్తి చేసి ఏప్రిల్ కి థియేటర్లలో దిగాలనుకుంటున్నాడు పవన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి