సంజయ్ దత్ కి లంగ్ క్యాన్సర్ వచ్చింది. థర్డ్ స్టేజ్ లో ఉన్నాడని తెలియగానే అభిమానులంతా షాకులో పడ్డారు. సంజు భాయ్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అయితే సంజుకి క్యాన్సర్ అని వార్త బయటకి వచ్చినప్పటి నుంచి కొంతమంది దర్శకనిర్మాతల్లో టెన్షన్ ఎక్కువైంది. సంజయ్ దత్ సైన్ చేసిన సినిమాల దర్శకనిర్మాతల్లో కలవరం మొదలైంది.
సంజయ్ దత్ లాక్ డౌన్ కి ముందు భారీ సినిమాలకి సైన్ చేశాడు. యశ్ ‘కె.జి.ఎఫ్-2’, అజయ్ దేవగణ్ ‘భుజ్’, అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’, రణ్ బీర్ కపూర్ ‘షంషేరా’సినిమాలకు కాల్షీట్స్ ఇచ్చాడు. అయితే కరోనా లాక్ డౌన్ తో ఈ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక మరో రెండు మూడు నెలల్లో మళ్లీ షూటింగ్ లు స్టార్ట్ అవుతాయనే ప్రచారం జరుగుతోన్న టైమ్ లో సంజయ్ దత్ కి క్యాన్సర్ అనే వార్త వచ్చింది. దీంతో ఈ సినిమాల దర్శక నిర్మాతలంతా టెన్షన్ పడుతున్నారు.
‘కె.జి.ఎఫ్-2’లో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు సంజయ్ దత్. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ లాస్ట్ లో రీస్టార్ట్ కాబోతోంది. అయితే అప్పటికి సంజయ్ సెట్స్ కి రావడం కష్టమే. ఎందుకంటే కీమోథెరపీ తర్వాత సంజు కొన్ని నెలలు రెస్ట్ తీసుకునే అవకాశముంది. దీంతో యశ్, సంజయ్ ఉన్న క్రూషియల్ సీన్స్ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారు దర్శకనిర్మాతలు.
ఇక హిందీ సినిమాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎందుకంటే సంజయ్ ఇప్పుడు సైన్ చేసిన సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ప్రుథ్వీరాజ్ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంటే, షంషేర్ ని 150 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇలా మొత్తంగా 6 సినిమాలు సంజయ్ దత్ కోసం ఎదురుచూస్తున్నాయని ఈ సినిమాల విలువ 700 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ టాక్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి