సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కాస్త ఎక్కువే. ఒకరు సెట్‌ అయితే.. వాళ్లనే రిపీట్‌ చేయడానికి ఇష్టపడతారు. దర్శకుడు హరీష్‌ శంకర్‌కు ఓ హీరోయిన్‌ బాగా కలిసొచ్చింది. పవన్‌ కల్యాణ్‌ మూవీలోనూ.. ఆ హీరోయిన్నే తీసుకోవాలనుకుంటున్నారు.

గద్దలకొండ గణేష్‌లో వరుణ్‌ తేజ్‌ శ్రీదేవి అభిమాని. స్వతహాగా జగదేకసుందరి అభిమాని అయిన హరీష్‌.. ఆమెలా పూజాని తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయాడు. ఆమెది ఇందులో 20 నిమిషాల పాత్రే అయినా.. రెమ్యునరేషన్‌ కాస్త ఎక్కువే అయినా.. పట్టుబట్టి మరీ పూజాతోనే చేయించాడు.

గద్దలకొండ గణేష్‌ తర్వాత హరీష్‌ శంకర్‌ పవన్‌కల్యాణ్‌ మూవీకి కమిట్‌ అయ్యాడు. పవన్ ప్రస్తుతం వకీల్‌సాబ్‌ చేస్తున్నాడు. ఆ తర్వాత క్రిష్‌ మూవీ పూర్తయితేగానీ.. హరీష్ సినిమాలో జాయిన్‌ కాలేడు. ఎంత టైం పట్టినా.. బాస్‌ గబ్బర్‌సింగ్‌ కోసం వెయిట్‌ చేస్తానంటున్నాడు హరీష్‌.

హరీష్‌ తన సినిమాలో పవన్‌కల్యాణ్ ‌కు జోడీగా పూజా హెగ్డేను చూడాలనుకుంటున్నాడు. మొదట్లో ఈ వార్తను డైరెక్టర్‌ ఖండించినా.. పూజా హెగ్డే అయితేనే సరిపోతుందని డిసైడ్‌ అయ్యాడట. అందులోనూ  గద్దలకొండ గణేష్‌ సక్సెస్‌కు పూజా హెల్ప్‌ అయింది. పవన్‌కు జోడీగా పూజా బాగుంటుందన్న ఆలోచనలో హరీష్ ఉన్నాడు. పూజా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్‌ దాదాపు పూర్తయింది. రాధే శ్యామ్‌ షూటింగ్‌ ఇంకో 40 శాతం మాత్రమే వుంది. ఈ లెక్కన పవన్‌, హరీష్‌ మూవీలో నటించడానికి డేట్స్‌ లేవన్న ప్రాబ్లమ్‌ లేదు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ కు జోడీగా పూజా హెగ్డే పేరు బలంగా వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పవన్, హరీష్ కాంబోలో సినిమా రానుండటంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పవన్ సరసన పూజా హెగ్డేనే బాగుంటుందని తెగ ఊహించేసుకుంటున్నాడు ఈ దర్శకుడు.

పవన్ కళ్యాణ్ ఆ మధ్య రాజకీయాల్లో బిజీ కావడంతో తమ అభిమాన హీరో ఎపుడు సినిమాలు చేస్తారా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూశారు. ఎన్నికల తర్వాత మళ్లీ మేకప్ వేసుకోవడంతో ఫ్యాన్స్ లో ఆశలు చెలరేగాయి.











 

మరింత సమాచారం తెలుసుకోండి: