ప్రస్తుతం సుధీర్ హీరోగా ఓ సినిమా సెట్స్ మీద ఉంది. ఇక లేటెస్ట్ గా మరో సినిమా ముహుర్తం పెట్టుకున్నారు. సాఫ్ట్ వేర్ సుధీర్ డైరక్టర్ రాజశేఖర్ రెడ్డి డైరక్షన్ లోనే ఈ సినిమా రాబోతుంది. అయితే సుధీర్ హీరో అనగానే హీరోయిన్ గా రష్మిని తీసుకోవచ్చు కదా అనుకుంటారు. స్మాల్ స్క్రీన్ పై వీరిద్దరి జోడీ అదిరిపోతుంది. రష్మి చీ కొడుతున్నా సరే ఆమె వెంట పడి ప్రపోజ్ చేస్తుంటాడు సుధీర్. ప్రేక్షకులు వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉంది అనిపించేలా వీరి యాక్టింగ్ ఉంటుంది.
స్మాల్ స్క్రీన్ పై వీరిద్దరికి ఉన్న ఆ కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై వర్క్ అవుట్ చేస్తే చూసే ఆడియెన్స్ ఉన్నారు. సుధీర్, రష్మి కలిసి సినిమా చేస్తే ఆ సినిమాకో సెపరేట్ క్రేజ్ వస్తుంది. కొత్తగా మొదలైన సినిమాలో కూడా సుధీర్ సరసన రష్మి హీరోయిన్ గా నటించట్లేదని తెలుస్తుంది. మరి బుల్లితెర మీద జోడీ కట్టిన ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై ఎందుకు కనిపించడానికి ఆసక్తి చూపట్లేదు అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సుధీర్ ఫలితాలతో సంబందం లేకుండా హీరోగా వరుస సినిమాలైతే చేస్తున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి